English | Telugu

ప‌గిలిన మాళ‌విక బోనం.. గాజుపెంకుతో వేద కాలికి గాయం!

స్టార్ మాలో కొంత కాలంగా ప్ర‌సార‌మ‌వుతూ మ‌హిళా వీక్ష‌కుల్ని అమితంగా ఆక‌ట్టుకుంటోన్న సీరియ‌ల్ ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ జంట‌గా న‌టిస్తున్నారు. ఇత‌ర పాత్ర‌ల‌ను బెంగ‌ళూరు ప‌ద్మ‌, మిన్ను నైనిక‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, ఆనంద్‌, సులోచ‌న‌, వ‌ర‌ద‌రాజులు తదిత‌రులు పోషిస్తున్నారు. స్టార్ ప్ల‌స్ లో ఏడేళ్ల క్రితం ప్ర‌సారం అయిన ఓ హిందీ సీరియ‌ల్ ఆధారంగా తెలుగులో రీమేక్ చేశారు.

స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డితే అమ్మ‌వారికి బోనం స‌మ‌ర్పిస్తాన‌ని వేద మొక్కుకుంటే, సులోచ‌న‌, ఖుషీ క్షేమంగా ఇంటికి తిరిగొస్తే బోనం ఎత్తుతాన‌ని మాలిని మొక్కుకుంటుంది. అందుకు త‌గ్గట్టుగానే అమ్మవారికి బోనం స‌మ‌ర్పించ‌డానికి ఇరు కుటుంబాల వారు అమ్మ‌వారి గుడికి వెళ‌తారు. అక్క‌డికి బోనంతో మాళ‌విక ఎంట్రీ ఇస్తుంది. ఖుషీకి క‌న్న‌త‌ల్లిని నేనే అని, నా బోన‌మే ముందు స‌మ‌ర్పిస్తాన‌ని వాద‌న‌కు దిగుతుంది. దీంతో య‌ష్ త‌ల్లి మాలిని గ‌ట్టి క్లాస్ పీకుతుంది. "నా కొడుక్కి భార్య‌వి కాదు.. మా ఇంటికి కోడ‌లివి కాదు, కానీ ఖుషీకి త‌ల్లివి ఎలా అయిపోతావే" అని నిల‌దీస్తుంది. అయినా స‌రే విన‌ని మాళ‌విక అక్క‌డున్న సోద‌మ్మ ద‌గ్గరికి వెళ్లి వేద క‌న్న‌త‌ల్లి కాద‌ని, డూప్లీకేట్ త‌ల్లి అని అంటుంది.

అందుకు సోద‌మ్మ ఎవ‌రు క‌న్న‌త‌ల్లో ఎవ‌రు కాదో.. ఎవ‌రిది పాశ‌మో.. ఎవ‌రిది ప్రేమ బంధ‌మో అమ్మే తేలుస్తుంద‌ని, ఎవ‌రి బోనం త‌ల్లికి ముందు స‌మ‌ర్పిస్తే వారే క‌న్న‌త‌ల్లి అని చెబుతుంది. అమ్మవారికి బోనం స‌మ‌ర్పించ‌డానికి గుడి మెట్లు ఎక్కుతుండ‌గా వేద కాలికి గాజు పెంకు గుచ్చుకుని ర‌క్తం కారుతూ వుంటుంది. అయినా సరే బోనం దించ‌కుండా వేద ముందుకు సాగుతూ వుంటుంది. ఇక మాలిని మెట్లెక్కుతూ ప‌డిపోవ‌డంతో బోనం జారి ప‌డి ప‌గిలిపోతుంది. దీంతో మాలిని అక్క‌డే కూర్చుని ఏడుస్తూ వుంటుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? వేద బోనం స‌మ‌ర్పించిందా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.