English | Telugu

పరిశ్రమలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో 22 ఏళ్ళ నటుడు మృతి!

అతని వయసు కేవలం 22 సంవత్సరాలు. నటుడుగా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. అతని ప్రతిభను చూసి దర్శకనిర్మాతలు కూడా అవకాశాలు ఇస్తున్నారు. కెరీర్‌ పరంగా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తున్న అతన్ని మృత్యువు కబళించింది. అతని పేరు అమన్‌ జైస్వాల్‌. శుక్రవారం రాత్రి ముంబైలోని జోగేశ్వరి హైవేలో బైక్‌పై వెళుతున్నాడు అమన్‌. వేగంగా వచ్చిన ఓ ట్రక్కు అతని బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడికి వెళ్ళిన అరగంటకే అమన్‌ మృతి చెందాడు. ఓ సీరియల్‌ ఆడిషన్‌ కోసం వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అమన్‌ ‘ధర్తిపుత్ర నందిని’ సీరియల్‌ ద్వారా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. సోనీ టీవీలో ప్రసారమైన ‘ పుణ్యశ్లోక్‌ అహల్యాబాయి’ సీరియల్‌లో యశ్వంత్‌రావు పాత్రను అమన్‌ పోషించారు. 2021లో ప్రారంభమైన ఈ సీరియల్‌ 2023లో ముగిసింది. మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన అమన్‌ ఆ తర్వాత సీరియల్స్‌తో బాగా పాపులర్‌ అయ్యాడు. అతను నటుడే కాదు, మంచి గాయకుడు కూడా. అతని మరణం పట్ల టీవీ రంగానికి చెందిన సహ నటీనటులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.