English | Telugu

అలాంటి తొక్కలో కామెంట్స్ పట్టించుకోవక్కర్లేదు


జబర్దస్త్ లో కమెడియన్ వెంకీ మంకీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి వెంకీ మంకీకి ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఐతే వెంకీ ఒక వేల్యుబుల్ పాయింట్ ని రైజ్ చేసాడు. అదేంటంటే ఇప్పుడు స్కిట్స్ బాగాలేదు అని అందరూ కామెంట్స్ పెట్టేస్తారు. బాగానే ఉంది. కానీ ఆ కామెంట్స్ కూడా బూతులతో కలిపి పెడతారు. అప్పుడు ఎవరూ కూడా ఆ కామెంట్స్ ని పట్టించుకోవాల్సిన పని లేదు. రీజనబుల్ గా ఒక పద్దతిగా స్కిట్ బాలేదు..కొంచెం మార్చుకోండి అని చెప్తే పట్టించుకోవాలి..కానీ ఇలాంటి వల్గర్ వాళ్ళు పెట్టె కామెంట్స్ అసలు పట్టించుకోవాల్సిన పని లేదు. నచ్చకపోతే నచ్చలేదు అని చెప్తే మార్చుకోవడంలో ఎదో ఒకటో చేయడానికి అవకాశం ఉంటుంది. కామెంట్స్ పెట్టేవాళ్ళు వాళ్ళ పని అసలు వాళ్ళు సరిగా చేస్తున్నారా ? పని లేని వాడు, సెన్స్ లేని వాళ్ళే ఇలాంటి కామెంట్స్ పెడతారు కాబట్టి అలాంటి వాటిని అస్సలు పట్టించుకోవాల్సిన పని లేదు.

నిజంగా స్కిట్ చూసి ఎనాలిసిస్ వాళ్ళు పెడితే వాళ్ళు బూతులు పెట్టరు. కాబట్టి అలాంటి వాళ్ళవి పట్టించుకుని చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది, స్టుపిడ్ మెంటాలిటీ వాళ్ళు పెట్టిన ప్రతీ కామెంట్ ని పట్టించుకోవాల్సిన పని లేదు. కొన్ని స్కిట్స్ బాగున్నా కూడా ఎడిటింగ్ కి వచ్చేసరికి కొన్ని బాగుండవు...ఆ విషయాలు వాళ్లకు తెలీవు. నెగటివ్ కామెంట్స్ మీదనే కాన్సంట్రేషన్ పెట్టాలి. పాజిటివ్ పాయిజన్ లాంటిది. కాబట్టి నెగటివ్ కామెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే బెటర్ గా పెర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంటుంది అని చెప్పాడు వెంకీ మంకీ ఒక ఇంటర్వ్యూలో.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.