English | Telugu

సురేఖావాణి కూతురు షాకిచ్చింది

వెండితెర‌పై క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల‌లో న‌టిస్తూ బిజీగా వున్నారు సురేఖావాణి. సినిమాల్లో హోమ్ లీగా క‌నిపించే సురేఖా వాణి సోష‌ల్ మీడియాలో మాత్రం మోడ్ర‌న్ డ్రెస్సుల్లో కూతురు సుప్రీత‌తో పోటీ ప‌డుతూవుంటుంది. ఈ ఇద్ద‌రూ క‌లిసి సోష‌ల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. గ్లామ‌ర్ ఫొటోలు, డ‌బుస్మాష్ వీడియోల‌తో నానా హంగామా చేస్తుంటారు.

వీరికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మామూలుగా లేదు. సుప్రీత గురించి కూడా ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. త‌న‌కు సోష‌ల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. చిట్టిపొట్టి డ్రెస్సుల్లో వీరు చేసిన వీడిఓలో నెట్టింట వైర‌ల్ అవ‌డ‌మే కాకుండా నెటిజ‌న్ లు ట్రోల్ చేసిన సంద‌ర్భాలు కూడా చాలానే వున్నాయి. నెట్టింట ఓ రేంజ్ లో హ‌ల్ చ‌ల్ చేస్తున్న సురేఖావాణి, సుప్రీత గ‌త కొంత కాలంగా త‌మ‌కు న‌చ్చిన ఫొటోలు, వీడియోల‌ని సేర్ చేస్తూ అభిమానుల్ని అల‌రిస్తున్నారు.

Also read:ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య‌ను క‌లిపేందుకు ర‌జ‌నీ విఫ‌ల‌య‌త్నం!

త‌ల్లి సురేఖ‌ని మించి సోష‌ల్ మీడియాలో యాక్టీవ్ గా వుండే సుప్రీత తాజాగా షాకింగ్ అప్ డేట్ ఇచ్చింది. త‌న‌కు కాబోయే జీవిత భాగ‌స్వామిని నెటిజ‌న్ ల‌కు ప‌రిచ‌యం చేసింది. ఓ వ్య‌క్తితో తాను స‌న్నిహితంగా వున్న ఓ ఫొటోని షేర్ చేస్తూ `అత‌ని ప్రేమ‌కు ఓకే చెప్పేశాను` అంటూ ఇన్ స్టా లో ఓ పోస్ట్ పెట్టింది. ప్ర‌స్తుతం సుప్రీత షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైర‌ల్ గా మారింది.

" width="400" height="700" layout="responsive">