English | Telugu

Bigg Boss 9 Telugu: శ్రీజ ఎలిమినేషన్.. ‌భరణి కోసం ఆమెకు అన్యాయం!

బిగ్ బాస్ హౌస్ లో సెకెండ్ ఛాన్స్ అంటే మాములు విషయం కాదు. శ్రీజ ఆరో వారం అనుకోకుండా ఎలిమినేట్ అయింది. అది ఆడియన్స్ ఓటింగ్ తో పని లేకుండా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళ ఒపీనియన్ ద్వారా శ్రీజ ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది. ఆ తర్వాత శ్రీజ ఎలిమినేట్ అన్ ఫెయిర్ అంటూ సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. స్టూడియో ముందు గొడవలు కూడా జరిగాయి. గొడవ ముదిరే కొద్దీ బిగ్ బాస్ టీమ్ శ్రీజని రీఎంట్రీ ఇస్తున్న గాసిప్ లీక్ అయింది.

అంతా బానే ఉంది.. కానీ అక్కడ అన్యాయం జరిగింది శ్రీజకి.. తనని రీఎంట్రీ ఇవ్వడంలో న్యాయం ఉంది.. కానీ మళ్ళీ భరణిని రీఎంట్రీ ఎందుకు చేసారు. చేస్తే చేసారు.. అన్యాయం జరిగిన శ్రీజనే మళ్ళీ ఎందుకు ఎలిమినేట్ చేసారని బిగ్ బాస్ ఫ్యాన్స్ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. శ్రీజ రెండోసారి హౌస్ లో నుండి వచ్చాక.. ఒక వీడియో పోస్ట్ చేసింది. నేను మళ్ళీ రెండోసారి హౌస్ నుండి బయటకు వచ్చాను.. భరణి గారు ప్రేక్షకుల ఓటింగ్ ద్వారానే బయటకు వచ్చారు.. నాకు అక్కడ అన్యాయం జరిగింది. నేను, భరణి గారు హౌస్ లోకి ఎంట్రీ వచ్చేటప్పుడు.. గేట్ ఓపెన్ చేసే వాళ్ళు భరణి గారితో మాట్లాడారు. ఈసారి అయినా బాగా ఆడండి భరణి గారు.. బాగా ఆడండి.. ఉంటారు కదా అని అక్కడున్న వాళ్లు అన్నారు. అప్పుడే నాకు అర్థం అయింది.. నేను ఎంత బాగా ఆడినా నేనే బయటకు వస్తానని శ్రీజ ఆ వీడియోలో చెప్పింది.

నేను ఒక కామనర్ గా వెళ్ళాను కాబట్టి ఇలా చేశారు.. అదే సెలబ్రిటీ అయితే ఇలాగే చేస్తారా అనే తంబ్ నెయిల్ తో శ్రీజ వీడియో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ కి అందరు శ్రీజకి సపోర్ట్ చేస్తున్నారు. ఎవరు సపోర్ట్ చేసినా శ్రీజకి అన్యాయం అయితే జరిగింది కదా.... సో ఫైనల్ గా బిగ్ బాస్ ఏది అనుకుంటే అది చేస్తాడు. ఇందులో నో డౌట్ అని మరొకసారి ఋజువు అయింది అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.