English | Telugu

 వీళ్ళు చెత్తవాళ్ళు అంటూ చీప్ గా తీసిపారేస్తారు..


శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి హాస్య నటుడు ఆలీ వచ్చారు. అలాగే ఈ షో మెయిన్ థీమ్ గా జిహెచ్ఎంసి పారిశుధ్య కార్మికుల కష్టాలను చూపిస్తూ ఈ ఎపిసోడ్ ని డిజైన్ చేశారు. వర్ష వచ్చి చెత్త తీసుకెళ్ళలేదేమిటి అంటూ ఒక పారిశుద్ధ్య కార్మికురాలిని అడిగేసరికి "మా చేతిలో చెత్త బుట్ట పెట్టకుండా మేమేటి సేత్తాం " అంటూ డైలాగ్ వేసింది. ఇక నాటీ నరేష్ వచ్చి "ఆఫ్ట్రాల్ చెత్త ఎత్తుకునేవాడా" అని తిట్టేసరికి రాంప్రసాద్ పెద్ద డైలాగ్ చెప్పాడు. "ఆఫ్ట్రాల్ కాదు సర్. హైదరాబాద్ లో మొత్తం 30 జోన్లు ఉన్నాయి. మీకు జలుబు, జ్వరం వస్తే కనీసం గేట్ కూడా దాటరు. కానీ మేము ఏ రోగం వచ్చినా కష్టపడతాం సర్." అని చెప్పాడు. తర్వాత కొంతమంది పారిశుద్ధ్య కార్మికుల్ని తీసుకొచ్చి వాళ్ళ కష్టాలను విన్నారు.

ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ టీమ్ మొత్తం కూడా వాళ్లకు సన్మానం చేశారు. తర్వాత ఆలీ, ఇంద్రజ మంచిగా డాన్స్ చేసుకుంటూ స్టేజి మీదకు వచ్చారు. "ఏప్రిల్ 28 కి నేను హీరో అయ్యి, ఇంద్రజ హీరోయిన్ అయ్యి 31 ఇయర్స్..మీకు ఇంకో విషయం చెప్పాలి. రష్మీ కూడా అప్పుడే వచ్చి 31 ఇయర్స్ " అని చెప్పాడు. ఇక పారిశుధ్య కార్మికులు తమ బాధల్ని చెప్పుకున్నారు. "మమ్మల్ని చెత్తవాళ్ళని చెప్పి దూరం పెట్టాలనుకుంటారు. వీళ్ళు చెత్తవాళ్ళు అంటూ చీప్ గా తీసిపారేస్తారు." అని చెప్పుకున్నారు. దానికి ఆలీ రియాక్ట్ అయ్యాడు. "ఎవరైతే ఆ మాటలు అన్నారో వాళ్ళు చెత్త. మీరు ఫీలవ్వక్కర్లేదు. మీరు ముత్యం" అన్నాడు. ఇక చలాకి చంటి పారిశుధ్య కార్మికుడి గెటప్ లో వచ్చి కాసేపు ఎంటర్టైన్ చేసాడు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.