English | Telugu

నన్ను సమాజానికి మగాడిగ పరిచయం చేసిన...

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో ఫుల్ జోష్ గ ఉంది. ఇందులో #90s లో కుర్రాడు రోహన్ రాయ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ చేశారు. ఆది వెంటనే కుర్రాడు రోహన్ ని పట్టుకుని ముద్దు పెట్టుకుని బర్త్ డే విషెస్ చెప్పాడు. తర్వాత సౌమ్యకి ముద్దు పెట్టబోతే ఛి, ఏంటిది అని కసిరింది. దానికి ఆది "ఇవన్నీ తెలీకుండానే ఇంత పెద్ద కొడుకు ఉన్నదా మనకు" అంటూ ఒక రొమాంటిక్ డైలాగ్ చెప్పింది. వీళ్ళ కోసం ఒక బ్యానర్ ని కూడా ప్రిపేర్ చేశారు.

"నానమ్మ-ఇంద్రజ, అమ్మమ్మ- రష్మి, బాబాయి - రాంప్రసాద్ ఆశీస్సులతో...నా కష్టం నా శ్రమ నా శక్తి నా చెమట చుక్క నా సమయం {2 నిమిషలు} వృధా కానివ్వకుండా నన్ను సమాజానికి మగాడిగ పరిచయం చేసిన నా కోడుకు రోహన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు - ఆది...పైన చెప్పింది అంతా అబద్ధం...ఇట్లు సౌమ్య" అంటూ రాసిన బ్యానర్ ఫన్నీగా ఉంది. తర్వాత ఐస్ క్రీం బండి పేరుతో ఒక ఫన్నీ స్కిట్ వచ్చింది. ఇందులో నూకరాజు, నాటీ నరేష్ ఇద్దరూ కలిసి ఐస్ క్రీం అమ్మే వారిలా గెటప్ వేసుకొచ్చారు. "ఇంద్రజ గారు ఐస్ క్రీం లాంటి వారు. ఏ ఎదవ వెళ్లి ఎం చెప్పినా ఇట్టే కరిగిపోతార్రా పాపం" అంటూ ఇంద్రజ మీద నూకరాజు కామెంట్ చేసేసరికి " ఆ ఎదవా మీరే కదా" అంటూ సౌమ్య నూకరాజుకి కౌంటర్ వేసింది. ఆ తర్వాత ఇంకో ఇంటరెస్టింగ్ సెగ్మెంట్ వచ్చింది..అదే ఆర్టిస్ట్స్ 10th క్లాస్ మార్క్స్ లిస్టులు. నూకరాజు మార్క్స్ లిస్ట్ ని చూపించింది రష్మీ. 600 కి 490 మార్కులు వచ్చాయి అని ఆది చెప్పేసరికి నూకరాజు తాను ఇప్పుడు లా కోర్స్ చదువుతున్నానని చెప్పాడు. తర్వాత భాస్కర్, ఫైమా మార్క్స్ లిస్ట్ కూడా చూపించారు. ఫైనల్ గా బెట్టింగ్ యాప్స్ మీద ఒక స్కిట్ వచ్చింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.