English | Telugu

సుధీర్, రష్మీల మధ్య ఏదో ఉందని చెప్పడానికి ఇదే సాక్ష్యం!

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు అమితంగా ఇష్టపడుతున్న షో ' శ్రీదేవీ డ్రామా కంపెనీ' ‌. ఇందులో యాంకర్ గా రష్మీ, హైపర్ ఆది చేస్తుండగా.. ఇంద్రజ జడ్జ్ గా చేస్తున్నారు. ఇక జబర్దస్త్ నుండి చాలా మంది ఈ షోకి వచ్చి ఎంటర్‌టైన్ చేస్తున్నారు.

టీవీ షోలలో అభిమానించే ఆన్ స్క్రీన్‌ జంటల్లో సుడిగాలి సుధీర్‌, రష్మి గౌతమ్ జంట ఒకటి. ఎప్పటినుండో ప్రేక్షకులు వీరి జంటను ప్రేక్షకులు అభిమానిస్తూనే ఉన్నారు. ఇద్దరి మధ్య ప్రేమ లేదు.. మంచి స్నేహితులు మాత్రమే అని తెలిసినా.. ఇద్దరిని జంటగా చూసేందుకే తెలుగు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. సుధీర్‌, రష్మీల జంట సూపర్‌ హిట్‌ జోడీ అన్నట్లు నిలిచింది. ఈ మధ్య కాలంలో వీరిద్దరు కలిసి షోలు చేయడం లేదు, అయినా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇక ఇప్పుడు ఆ కాంబో మళ్ళీ రిపీట్ చేసేలా శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమోని వదలింది.

నవరాత్రి స్పెషల్ ప్రోమోగా రిలీజైన ఈ ప్రోమోలో మొదటగా.. బలగం నల్లిబొక్క ఫేమ్ అతను .. ఈ ముసలోడికి దసరా పండగా కావాలని చెప్పాడు. నీకు స్వయంవరం ఏర్పాటు చేస్తానంటు హైపర్ ఆది చెప్తాడు. ఇక ఆ తర్వాత డ్యాన్స్ , సింగింగ్ ఉంది. కాసేపటికి హైపర్ ఆది ఓ టాస్క్ ఇచ్చాడు. అక్కడ ఉన్నవారి ఫోన్ లు అన్నీ తీసుకున్నాడు. మీ ఫ్రెండ్ కి గానీ ఇంట్లో వాళ్ళకి గానీ కాల్ చేసి.‌ అర్జెంట్ గా నాకు పది వేలు కావాలని అడగాలని హైపర్ ఆది చెప్పాడు. మొదటగా బుల్లెట్ భాస్కర్ వాళ్ళ నాన్నకి కాల్ చేసి.‌ నాన్న నాకు అర్జెంటుగా పదివేలు గూగుల్ పే చేయవా అని అనగానే.. భాస్కర్ వాళ్ళ నాన్న కాల్ కట్ చేస్తాడు. ఇక ఆ తర్వాత హైపర్ ఆది మహతికి ఫోన్ చేస్తే‌‌.. మంచి కాలర్ ట్యూన్ వస్తుంది. అది విని. ఒరేయ్.. ఆ బాడీకి ఈ పాటకి ఏం అయిన సంబంధం ఉందా అని ఆది అంటాడు. ఇక తనని అడుగగా.. పంపిస్తానని అంటుంది. ఇక ఆ తర్వాత రష్మీని సుధీర్ కు కాల్ చేయమని చెప్తాడు. బేబ్‌ అంటు రష్మీ ఇటు నుండి అనగా.. చెప్పరా అంటూ సుధీర్ సమాధానం ఇవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది. రష్మి రూ.10 వేలు అడిగిన వెంటనే ఇదే నెంబర్ కి గూగుల్‌ పే ఉందా అంటూ ఫోన్ కట్‌ చేసే లోపే ఆ అమౌంట్‌ ను సుధీర్‌ పంపించాడు. ఇక మన ఎడిటర్ మామ మంచి బ్యాక్ గ్రౌండ్ సాంగ్ వేసి హైప్ ఇచ్చాడు. దాంతో ఇది ఇప్పుడు వైరల్ గా మారింది. నెటిజన్స్ ప్రోమో నుంచి సుధీర్, రష్మీల సంభాషణ వరకు కట్‌ చేసి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్‌ చేస్తున్నారు. మళ్లీ వీరి ట్రెండ్‌ మొదలైందని తెలుస్తోంది. రష్మీ, సుధీర్ కలసి షోలు చేయాలని కోరుకుంటున్నవారు చాలా మందే ఉన్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.