English | Telugu

మీ చూపులో లోపం ఉంది.. స్పందించిన‌ శ్రావ‌ణ భార్గ‌వి

శ్రావణ భార్గవి ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తోంది. భర్తతో విడాకుల వ‌దంతుల వ్య‌వ‌హారం ఇలా సద్దుమణిగిందో లేదో, ఇప్పుడో మరో అంశంతో ఆమె మళ్ళీ తెరపైకి వచ్చి వార్తలకెక్కింది. తాళ్ళపాక అన్నమాచార్యులు రచించిన ఒక కీర్తన తన అందాన్ని వర్ణించేలా వాడుకున్నారంటూ అన్నమాచార్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర స్వామి వారి అభిషేకం సమయంలో ఆయన్ని కీర్తించేందుకు రాసిన అన్నమాచార్య కీర్తన "ఒకపరి వయ్యారమే" అనే దానికి చక్కగా అభినయిస్తూ ఉన్న ఒక వీడియో తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది శ్రావణ భార్గవి. ఇప్పుడు ఆ వీడియో పెద్ద వైరల్ అయ్యి వార్తలకెక్కింది.

ఈ విషయం అన్నమయ్య కుటుంబ సభ్యుల వరకు వెళ్లేసరికి వాళ్ళు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ కీర్తనకు శ్రావణభార్గవి తనదైన శైలిలో కాళ్ళు చూపిస్తూ, బ్యాక్ వ్యూలో డీప్ బ్లౌజ్ వేసుకుని వీపు చూపిస్తూ పలు భంగిమల్లో వీడియో చేయడం పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ఈ కీర్తనకు సంబంధించిన వీడియోను తొలగించాలని కొంతమంది అడిగేసరికి భార్గవి తనదైన రీతిలో సమాధానం ఇచ్చింది. "మీకు దృష్టిలోపం ఉంటే నేనేం చేయలేను. భక్తి భావంతో చూస్తే అమ్మవారే కనిపిస్తారు. కానీ మీ చూపులో లోపం ఉంది. నిండుగా దుప్పటి కప్పుకున్న అమ్మాయి కూడా చూపు సరిగా లేకపోతే అశ్లీలంగానే కనిపిస్తుంది." అని ఘాటుగానే వ్యాఖ్యలు చేసింది. "ఈ వీడియోలో అభ్యంత‌ర‌కంగా ఉన్నది ఏదీ లేదు" అని చెప్పింది శ్రావణభార్గవి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.