English | Telugu
'జబర్దస్త్' అంటే ఒలింపిక్స్‌లో పార్టిసిపేట్ చేయడంలాంటిదే!
Updated : Jul 20, 2022
'జబర్దస్త్'లో రాఘవ స్కిట్స్ అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది ఆడియన్స్ లో. స్కిట్ విన్ ఐనా లేకపోయినా రాఘవ స్కిట్స్ కి ఎప్పుడూ అభిమానులు ఉంటూనే ఉంటారు. 2001లో ఇండస్ట్రీ లోకి వచ్చిన రాఘవ కొన్ని మూవీస్ లో, సీరియల్స్ లో కూడా నటించాడు. జబర్దస్త్ మొదలయ్యేనాటికి అప్పటికే నాకు కామెడీ చేయడంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అది తెలిసిన జబర్దస్త్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు ఫోన్ చేసి ఆఫర్ ఇచ్చారు అని చెప్పాడు రాకెట్ రాఘవ ఒక ఇంటర్వ్యూలో. జెమినీలో యాంకరింగ్ చేసి, సినిమా ప్రమోషన్స్ వంటివి కూడా చేశాడు రాఘవ.
"జబర్దస్త్ నుంచి చాలా మంది వెళ్ళిపోయి వచ్చారు, కొంతమంది పూర్తిగా వెళ్లిపోయారు. ఐతే నేను వెళ్లకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ నాకు వర్క్ శాటిస్‌ఫాక్షన్ ఉంది. ఎంతైనా ఇక్కడ యాక్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే ఇంకో విషయం ఏమిటంటే.. బయటికి వెళ్తే ఖాళీ ఐపోతానేమో అనే భయం. ఈ రెండు కారణాల వలన నేను ఎప్పుడు జబర్దస్త్ ని వీడి బయటకు వెళ్ళలేదు" అని చెప్పాడు రాఘవ.పాత టీం మెంబెర్స్ నుంచి ఎంతో నేర్చుకున్నా, అలాగే కొత్త వాళ్ళతో కలిసి తక్కువ సమయంలో ఎలా కామెడీ పంచాలో నేర్చుకుంటున్నానని చెప్పాడు రాఘవ.
"జబర్దస్త్ లో కొన్ని కోల్డ్ వార్స్ జరిగాయని అంటారు కానీ నేను అసలు ఎలాంటి విషయాలు పట్టించుకోను. ఏం మాట్లాడితే ఎం అవుతుందో అని నేను చాలా సైలెంట్ గా నా పని చేసుకుని వెళ్ళిపోతాను" అని చెప్పాడు. "కాంపిటీషన్ లో నెగ్గనప్పుడు చాలా భయమేసేసివెనకబడుతున్నానా అనే ఫీలింగ్ మనసులో ఎక్కువ ఉండేది. అందుకే చాలా షోస్ ని తగ్గించుకుంటూ వచ్చి దీని మీద ఎక్కువ కాన్సన్‌ట్రేషన్ చేస్తున్నాను" అని చెప్పాడు. "జబర్దస్త్ షూటింగ్ జరిగే రోజు ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నట్టే ఉంటుంది అందరికీ. అక్కడ గోల్డ్ మెడల్ కొట్టాలని ఎలా ఉంటుందో, ఇక్కడ స్కిట్ కొట్టాలనే పట్టుదల అందరిలో పెరిగిపోతుంది. దీంతో బీపీ, టెంపరేచర్ల కూడా బాగా పెరిగిపోతాయి" అని చెప్పాడు రాఘవ.