English | Telugu

అక్కడ శిల్పశెట్టి... ఇక్కడ రీతూ చౌదరి!

ఆలీతో ఆల్ ఇన్ వన్ ఈ వారం షో మంచి ఫన్నీగా సాగింది. ఈ షోకి రీతూ చౌదరి, జెస్సి, స్రవంతి వచ్చారు. ఇక ఈ షోలో ఆలీ రీతూని తెగ పొగిడేశారు. స్టేజి మీదకు రాగానే రీతుతో కలిసి ఆలీ డాన్స్ చేశారు. "మీ నేటివ్ ఎక్కడ" అని అడిగేసరికి "ఖమ్మం.. ఆంధ్ర తెలంగాణ బోర్డర్. అందుకే నేను అక్కడ, ఇక్కడా ఉంటాను" అని చెప్పింది. "నీ గొంతు బాగుందని ఎవరైనా చెప్పారా" అని అడిగేసరికి "నా గొంతుకు చాలామంది ఫాన్స్ ఉన్నారు ఎం మీకు నా గొంతు నచ్చలేదా " అని అడిగింది "ఎందుకు బాలేదు , అద్భుతం నాకు తెలిసి హిందీ స్టార్స్ లో శిల్పశెట్టికి ఈ గొంతు ఉంది ఇక్కడేమో రీతూకి ఉంది" అని తెగ బిల్డప్ ఇచ్చారు.

తర్వాత జెస్సి ఎంట్రీ ఇచ్చాడు "నువ్వు ఇండస్ట్రీకి రావడానికి ఎవరు ఇన్స్పిరేషన్" అని అడిగారు "పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్..ఆయన్ని చూసే మార్షల్ ఆర్ట్స్ నేను మూడేళ్లు నేర్చుకున్నా. రెడ్ బెల్ట్ వరకు వచ్చి ఆగిపోయాను తర్వాత నాంచాక్ తిప్పడం వంటివన్నీ ప్రాక్టీస్ చేశాను" అని చెప్పాడు. తర్వాత స్రవంతి ఎంట్రీ ఇచ్చింది.."నీకు ఇండస్ట్రీలోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు" అనేసరికి "అనసూయ యాంకరింగ్ అంటే ఇష్టం..ఆమెను ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాను. అలాగే నాది లవ్ మ్యారేజ్ మా ఆయన నేను పవన్ కళ్యాణ్ ఫాన్స్...అందుకే మా బాబుకు కూడా అకీరానందన్ అని పేరు పెట్టుకున్నా " అని చెప్పింది. ఇలా ఈ ముగ్గురితో గేమ్స్ ఆడించాడు ఆలీ. ఇక ఈ ముగ్గురు కూడా సోషల్ మీడియాలో ఫుల్ అప్ డేట్ గా ఉంటారు. రీల్స్ తో వాళ్ళ వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ లో ఫాన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు.