English | Telugu

కన్ఫెషన్ రూమ్ లో ప్రేరణ రివీల్ చేసిన సీక్రెట్ అదే!

బిగ్ బాస్ సీజన్-8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత ఆట స్వభావమే మారిపోయింది. ప్రతి సీజన్ లో గాసిప్ చెప్పుకోవడానికి ఒకరుంటారు. అది అమ్మాయి మాత్రమే ఉంటుంది. ఒక విషయం ఒక అమ్మాయికి తెలిస్తే ఎవరికీ చెప్పొద్దంటూ ఒక్కక్కరిగా అందరికి తెలుస్తుంది. ప్రస్తుతం హౌస్ లో గాసిప్ క్వీన్ ఎవరు అంటే హరితేజ అని తెలుస్తోంది.

హరితేజ సైలెంట్ గా ఉంటూ అంత అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఎవరు ఎలా ఉన్నారు.. ఏం చేస్తున్నారు ఎవరితో ఉన్నారు.. ఏం మాట్లాడుతున్నారంటూ అంతా కనిపెడుతూ ఉంటుంది. విష్ణుప్రియ, పృథ్వీలు టాస్క్ అనంతరం.. విష్ణుప్రియ భుజాలపై పృథ్వీ చెయ్యి వేస్తుంది. అలా ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత హరితేజ వేరేవాళ్ళతో మాట్లాడుతు.. అక్కడ వాళ్ళు అనుకుంటున్నారు. విష్ణు, పృథ్వీలు గంటలు గంటలు మాట్లాడుకుంటారు కదా అసలేం మాట్లాడుకుంటారని అంటున్నారు. నిజంగానే వాళ్ళ మధ్య ఏమైనా నడుస్తుందా.. అది ఎక్కడి వరకు వెళ్తదని తేజ వాళ్ళు అనుకుంటున్నారు. మనం హౌస్ లోకి వచ్చినపుడు మన గురించి మాట్లాడుకుంటే స్క్రీన్ స్పేస్ ఉంటుంది. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళకి బెన్ఫిట్ తప్ప ఏం లేదని మళ్ళీ హరితేజ డ్యూయెల్ గా మాట్లాడుతుంది.

ఆ తర్వాత ప్రేరణని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ కి పిలిచి కేక్ ముందు పెట్టి.. అది కావాలంటే హౌస్ గాసిప్ చెప్పండి అని బిగ్ బాస్ అంటాడు. యష్మీ పట్ల నిఖిల్ కి ఏం లేదు అంటున్నాడు కానీ ఉంది బయటపడట్లేదని ప్రేరణ చెప్తుంది. హౌస్ లో ఎవరికి వారే లవ్ ట్రాక్ నడుపుతూ గాసిప్ కి ఛాన్స్ ఇస్తున్నారనేది అందరికి తెలిసిందే. మరోవైపు హౌస్ లో అవినాష్, టేస్టీ తేజ, రోహిణి ఎంటర్‌టైన్మెంట్ కావాలన్న ప్రతీసారీ తమ సత్తా చాటుతున్నారు.‌ ఇక హౌస్ లో ఏ గేమ్ లోనైనా బాయ్స్ తో పోటీగా ప్రేరణ పుడింగిలా ఆడుతుంది. ఈ వీక్ ఎవరు మెగా ఛీఫ్ అవుతారో చూడాలి మరి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.