English | Telugu

Prerana Vs Tanuja: ప్రేరణ వర్సెస్ తనూజ.. గెలుపు ఎవరిది!

బిగ్ బాస్ సీజన్-9 లో ఫ్యామిలీ వీక్ ముగిసింది. ‌ఇక కెప్టెన్సీ టాస్క్ లు జోరుగ సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఎక్స్ హౌస్ మేట్స్ ని హౌస్ లోకి రప్పించి వారితో హౌస్ లోని కంటెస్టెంట్స్ చేత కెప్టెన్సీ టాస్క్ లు ఆడిస్తున్నాడు బిగ్ బాస్.

ఇందులో భాగంగా నిన్నటి ఎపిసోడ్ లో‌ ప్రియాంక జైన్, గౌతమ్ కృష్ణ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి కెప్టెన్సీ టాస్క్ లు ఆడగా.. పవన్ కళ్యాణ్ కెప్టెన్సీ కంటెండర్ అవ్వగా.. భరణి కెప్టెన్సీ రేస్ నుండి తప్పుకున్నాడు. ఇక తాజాగా వదిలిన ప్రోమోలో హౌస్ లోకి ఎక్స్ కంటెస్టెంట్ ప్రేరణ వచ్చేసింది. తను వచ్చీ రాగానే అందరికి హాయ్ చెప్పేసింది. అందరు గేమ్ బాగా ఆడుతున్నారని చెప్పింది. నేను నిజానికి చాలా బాధపడ్డాను.. ఏంటిది టూ టూ హౌసెస్ అంటున్నారు.. పక్కనే ఇంకో సెట్ కట్టారా అని అనుకున్నానని ప్రేరణ అంటుంది. హమ్మయ్య వీళ్ళని కరెక్ట్ ప్లేస్ లో పడేశారని అనుకున్నావా అంటూ ఇమ్మాన్యుయల్ పంచ్ వేయగానే హౌస్ మేట్స్ అంతా నవ్వుకున్నారు. ప్రేరణ నువ్వు టఫ్ ప్లేయర్ నాకు నీతో ఆడాలని ఉంది అని తనూజ అనగానే తననే సెలెక్ట్ చేసుకుంది ప్రేరణ.

ఇక హౌస్ లో జరిగిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో తనూజ గెల్చినట్టుగా తాజాగా వదిలిన ప్రోమో(Bigg Boss 9 Promo) లో చూపించాడు బిగ్ బాస్‌. అయితే భరణి వర్సెస్ గౌతమ్ కృష్టతో జరిగిన టాస్క్ లో కూడా గౌతమ్ ఓడినట్టుగా ప్రోమోలో చూపించాడు బిగ్ బాస్ కానీ ఎపిసోడ్ కి వచ్చేసరికి భరణి ఓడిపోయాడు. అలాంటి ట్విస్ట్ ఏదైనా ఉంటుందా లేక తనూజ గెలిచిందా తెలియాలంటే నేటి ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.