English | Telugu

Sanjana Refuses to Apologise: సారీ చెప్పే ప్రసక్తే లేదు.. ఇమ్మాన్యుయేల్ వెళ్ళిపోయాడు!


బిగ్ బాస్ సీజన్-9 లో ఫ్యామిలీ వీక్ ముగిసింది. హౌస్ లో ఇప్పుటి వరకు ఒక లెక్క ఇప్పటినుండి ఒక లెక్క అన్నట్లు సాగుతుంది. నామినేషన్ ప్రక్రియలో నిజంగానే చదరంగం కాదు.. ఇది రణరంగమే అన్నట్లు సాగింది. నామినేషన్ అనంతరం కూడా దాని తాలూకా గొడవలు హౌస్ లో కంటిన్యూ చేశారు. నువ్వు రోజు రాత్రి డీమాన్ తో కూర్చుంటావని సంజన అన్నమాటలకి రీతూ బాగా హర్ట్ అయింది. బాత్రూంలోకి వెళ్లి బాగా ఏడుస్తుంది తనూజ.

ఏడుస్తున్నా రీతూని డీమాన్ పిలుస్తాడు. ప్లీజ్ రీతూ బయటకు రా ఏడ్వకని రిక్వెస్ట్ చేస్తాడు.. రీతూ బయటకు వచ్చాక ప్లీజ్ డీమాన్ నువ్వు వెళ్ళు.. నేను రీతూ మాట్లాడుతానని తనూజ అంటుంది. ఇక్కడ ఎవరం ఏ తప్పు చెయ్యడం లేదు.. మీరేంటో మీకు తెలిసినప్పుడు, ఎవరో ఏదో అన్నారని పట్టించుకోవద్దని తనూజ అంటుంది. నాకు ఆ బాధ ఉండిపోయిందని రీతూ ఏడుస్తుంది. మరొకవైపు సంజన దగ్గరికి ఇమ్మాన్యుయల్ వెళ్లి.. ''నువ్వు అన్నమాట తప్పు ఇక్కడ గొడవ అంతా ఎవరు చూడరు.. ఒక్క మాటనే పట్టుకుంటారు.. ప్లీజ్ వెళ్లి సారీ చెప్పు" అని సంజనతో ఇమ్మాన్యుయేల్ అంటాడు. నేను చెప్పను.. తను నన్ను ఎన్నో అంది పతివ్రత శిరోమణి అంది.. మొదట్లో దానికి ఏమైనా సారీ చెప్పిందా.. ఇప్పుడు తనదే తప్పు.. తను ఫస్ట్ సారీ చెప్తే నేను చెప్తానని సంజన మొండిగా అంటుంది. నీకు వాళ్ళు ఇద్దరు పక్కన కూర్చుంటే.. తమ్ముడు నీకంటే ఇక్కడ పెద్ద వాళ్ళం ఉన్నాం.. నువ్వు అలా పక్కన కూర్చుంటే ఇబ్బందిగా ఉంది అని మెల్లగా కూర్చొని చెప్పాలి కానీ ఇలా నామినేషన్ లో చెప్పే విషయం అది కాదని ఇమ్మాన్యుయేల్ అంటాడు.

మరి వాళ్ళు కూడా అలాగే కూర్చొబెట్టుకొని.. అక్క నీ గేమ్ కన్పించడం లేదు.. ఇకనైనా ఆడు అని చెప్పాలి కదా.. నామినేట్ చేసి చెప్పాలా అని సంజన అనగానే ఇక తనతో వాధించి ప్రయోజనం లేదని ఇమ్మాన్యుయేల్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత సంజన దగ్గరికి డీమాన్ వచ్చి.. అక్క రీతూకి సారీ చెప్పండి అని అంటాడు. నేను చెప్పను తనే నాకు సారీ చెప్పాలని సంజన అంటుంది. కాసేపటికి భరణి, సుమన్ ఇద్దరు సంజన దగ్గరికి వచ్చి రీతూ విషయంలో మీరు మాట్లాడింది తప్పు అని అంటారు. అయినా సంజన మాత్రం మొండిగా ఉంటుంది. వీకెండ్ లో నాగార్జున చెప్పమంటేనైనా రీతూకి సంజన సారీ చెప్తుందో లేదో చూడాలి మరి.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.