English | Telugu
bigg boss agnipareeksha : అందరితో కన్నీళ్లు పెట్టించిన ప్రసన్న ఎలిమినేషన్
Updated : Sep 3, 2025
బిగ్ బాస్ అగ్నిపరీక్ష డోర్స్ క్లోజ్ కావడానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. ఆ విషయాన్ని నవదీప్ చెప్తూ వస్తున్నాడు. ఇక ఈ రోజు ఇద్దరినీ ఏలిమినేట్ చేశారు. అందులో ఒకరు ప్రసన్న కుమార్. ఆయనకు నవదీప్ రెడ్ కార్డు ఇచ్చేసరికి అక్కడున్న వాళ్లంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యంగా అతనితో జోడిగా ఉన్న విజయవాడ అడ్వకేట్ నాగా కూడా తట్టుకోలేకపోయాడు. 12 వ ఎపిసోడ్ లో జరిగిన మినీ టాస్క్ లో నాగా డంబ్ అంటూ ట్యాగ్ ఇచ్చాడు. ఐతే తర్వాత ప్రసన్న నాగా విషయంలో కరెక్ట్ పాయింట్స్ కూడా రైజ్ చేయలేదు. ఇక 13 వ ఎపిసోడ్ లో ఇచ్చిన టాస్కుల్లో కూడా ప్రసన్న సరిగా పెర్ఫార్మ్ చేయలేకపోవడం అలాగే నాగా కూడా టాస్క్ గెలవడానికి చాల ఎఫోర్ట్స్ పెట్టిన గెలవలేకపోయాడు. ఐతే ప్రసన్నకు ఆల్రెడీ ఎల్లో కార్డు ఉండడం కూడా మైనస్ అయ్యింది. దాంతో నవదీప్ రెడ్ కార్డు ఇచ్చి ఇక షో నుంచి ఏలిమినేట్ అయ్యారంటూ చెప్పాడు. ఇది నువ్వు ఉండాల్సిన షో కాదు. బయట ఉన్నది నీ ప్రపంచం. నీ కథ ఈ ప్రపంచానికి తెలిసింది. అలాగే నీ జర్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉంది. ఇక ఒక్క ఎపిసోడ్ మాత్రమే ఉంది. ఇంత వరకు వచ్చావంటే గ్రేట్ అంటూ నవదీప్ చెప్పుకొచ్చాడు. ఇక ప్రసన్న కన్నీళ్లు పెట్టుకున్నాడు.
నాగ కూడా కన్నీళ్లు పెట్టుకుని నేను గెలిపించడానికి చాలా ట్రై చేశా అని చెప్పాడు. కానీ ప్రసన్న కూడా నాగాకి డంబ్ అనే ట్యాగ్ ఇచ్చే ఉద్దేశం లేదని టాస్క్ కాబట్టి ఇచ్చానని చెప్పాడు. ఇద్దరం అసలు మాట్లాడుకోవడానికి కుదరలేదు లేదంటే ఆ ట్యాగ్ కూడా ఇచ్చేవాడిని కాదు అని చెప్పాడు. హరీష్ , సోల్జర్ పవన్ కుమార్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక నాగా కూడా చాలా ఓపెన్ అయ్యాడు. ఫస్ట్ డే ఆయన్ని చూసాను కానీ రెండో రోజు అతని స్టోరీ విన్నాక నిజంగా గుండె ముక్కలైపోయింది. అభిజిత్ గారు చెప్పినట్టు ఆయన రియల్ లైఫ్ హీరో అని అన్నాడు. ఇక అందరూ కలిసి అతన్ని సాగనంపారు.