English | Telugu

నవదీప్ అబద్దాలు చాలా బాగున్నాయి

సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్ సింగింగ్ షోకి లవ్ మౌళి మూవీ టీమ్ నుంచి నవదీప్, భావన వచ్చి కాసేపు ఎంటర్టైన్ చేశారు. నవదీప్ ఈ మూవీ గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు. ఈ మూవీలో పాత్ర చాలా వండర్ ఫుల్ గా ఉంటుందని చెప్పాడు. ఇక అనంత శ్రీరామ్ నవదీప్ గురించి ఒక అద్భుతమైన కంప్లిమెంట్ ని ఈ షోలో ఇచ్చేసారు. ఎవరైనా పాత్ర కోసం కష్టపడటం చూసాం కానీ ఒక పాత్ర కోసం రెండేళ్లు జుట్టు పెంచుకుని ఒక అజ్ఞాత వ్యక్తిగా ఆ పాత్ర కోసం కష్టపడిన వ్యక్తిని ఒక్క నవదీప్ నే చూసాను అని చెప్పేసరికి స్టేజి మొత్తం చప్పట్లే చప్పట్లు మారు మోగాయి.

ఇక నవదీప్ అనంత శ్రీరామ్ గురించి చెప్తూ ఆయన 32 రోజులు షూటింగ్ సెట్ లో తిరుగుతూ ఫుల్ ఎంజాయ్ చేసారని చెప్పుకొచ్చారు. ఆయన షూటింగ్ సెట్ లో చేసినా ఎంజాయిమెంట్ నే ఫీల్ అయ్యి పాటల రూపంలో రాసారని చెప్పారు. అంతే కాదు హీరోయిన్స్ తో కలిసి వాటర్ ఫాల్స్ లో డాన్స్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారని, ఆయన రోజూ చేసే హడావిడి అంతా ఇంతా కాదని చెప్పేసరికి అనంత శ్రీరామ్ ఇప్పుడవన్నీ ఎందుకు చెప్పడం అంటూ సిగ్గు పడతారు. శ్రీముఖి నవదీప్ మాటలకు అనంత శ్రీరామ్ ని ఆట పట్టిస్తుంది. బాగా చెప్పానా అనేసరికి నవదీప్ అబద్దాలు చాలు బాగున్నాయ్..అంటూ దణ్ణం పెట్టేస్తారు. అంతే నవదీప్ నవ్వేస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.