English | Telugu

డోంట్ ప్లే గేమ్స్ విత్ మి.. మణికంఠపై నాగార్జున ఫైర్!

బిగ్ బాస్ సీజన్-8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత టాస్క్ లతో ఎంటర్‌టైన్మెంట్ తో సూపర్ గా సాగుతుంది. ఇక వీకెండ్ లో వచ్చిన నాగార్జున అదిరిపోయే నాటుముక డ్యాన్స్ చేశాడు.‌ఇక వచ్చీరాగానే హౌస్ లో ఉన్నవారి గేమ్ ఎలా ఉందో చెప్పుకొచ్చాడు.

హౌస్ లో ఆటతీరుని బట్టి ఎవరు రైజింగ్ స్టార్, ఎవరు ఫాలింగ్ స్టార్ అని చెప్తూ వారి ఫోటోలని అక్కడున్న బోర్డుకి పెట్టాడు నాగార్జున. హౌస్ లో నీ గేమ్ డౌన్ అయిందంటు టేస్టీ తేజని ఫాలింగ్ స్టార్ లిస్ట్ లో పెట్టాడు నాగార్జున. ‌ఇక విష్ణుప్రియని లేపి.. మొదటి వారం నుండి అందరు నిన్ను నామినేషన్ చేస్తున్నారు. నీ గేమ్ బాలేదు.‌. టాస్క్ లు సీరియస్ గా తీసుకోవడం లేదు.. ఇలానే ఉంటే నిన్ను జనాలు సీరియస్ గా తీసుకోరు అందుకే నీకు ఫాలింగ్ స్టార్ అంటు ఆ లిస్ట్ లో విష్ణుప్రియని చేర్చాడు నాగార్జున. ఇక కిర్రాక్ సీతని లేపి.. ఈ వీక్ నీ గేమ్ లేదు.. నీ దగ్గర ఉన్నవాటిని నువ్వు కాపాడుకోలేవ్ కానీ నీ స్ట్రాటజీ కరెక్ట్ అందుకే నిన్ను ఫాలింగ్ నుండి రైజింగ్ స్టార్ లిస్ట్ లోకి ఇస్తున్నానంటూ నాగార్జున చెప్పాడు.

ఆ తర్వాత మెగా ఛీఫ్ అయినందుకు మెహబూబ్ కి రైజింగ్ స్టార్ లిస్ట్ లో పెట్టాడు‌ నాగార్జున. ఆ తర్వాత అవినాష్ ఫన్ బాగుందని అతడికి రైజింగ్ స్టార్ ఇచ్చాడు. ఇక రోహిణి కూడా తన గేమ్ బావుందంటు ఆమెను రైజింగ్ స్టార్ లిస్ట్ లో చేర్చాడు. ఏంటీ రోహిణీ.. నీకు నోటి దూలా.. మణికంఠ నీకు బచ్చాలా కనిపిస్తున్నాడా అని నాగార్జున అనగానే.. నేను ఆ ఇంటెన్షెన్ తో అనలేదు సర్.. ఏం మణికంఠ ఫీల్ అయ్యావా అని రోహిణి అనగానే లేదని మణికంఠ అన్నాడు. చాలా ఫీల్ అయ్యాడు రోహిణి.. మణికంఠ అంటే ఫీలూ.. ఫీల్ అంటే మణికంఠ అని నాగార్జున అన్నాడు. అతన్ని నువ్వు అవమానించావని ఫీల్ అవుతున్నాడంటూ నాగార్జున అనగా.. అమ్మో అంతమాటా.. నేను అంత ఫీల్ అవ్వలేదు సర్ అని మణికంఠ అన్నాడు. ఫీల్ అయ్యావ్ కదా.. ఇప్పుడెందుకు కవర్ చేస్తున్నావ్.. డోన్ట్ ప్లే గేమ్స్ విత్ మీ.. నువ్వు ఫీల్ అయ్యావ్ అని చెప్పాను.. అయినట్టే.. అది అయిపోయింది. మళ్లీ ఫీల్ అవ్వలేదని అంటావ్ ఏంటని మణికంఠపై నాగార్జున సీరియస్ అయ్యాడు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.