English | Telugu

నబీల్ ఎలిమినేషన్.. కన్నడ బ్యాచ్ కి ఫేవరెటిజం చూపిస్తారా!

బిగ్ బాస్ సీజన్-8 మొదలై పన్నెండు వారాలు కావస్తోంది. అయితే ఇప్పటివరకు హౌస్ నుండి బయటకు వచ్చినవారంతా తెలుగువాళ్ళే.‌ కానీ కన్నడ బ్యాచ్ లోని ప్రేరణ, నిఖిల్,‌పృథ్వీ, యష్మీలు ఎన్నిసార్లు నామినేషన్ కి వచ్చిన ఎలిమినేషన్ దగ్గరగా వచ్చి సేవ్ అవుతున్నారు.

అసలేం జరుగుతుంది. ‌ప్రతీవారం పృథ్వీ, ప్రేరణ, యష్మీ నామినేషన్ లోకి రావడం చివరికి తెలుగు కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ అవ్వడం ఇదే జరుగుతుంది. ‌దీన్ని బట్టి చూస్తే బిగ్ బాస్ కన్నడ బ్యాచ్ కు ఫేవరెటిజం చేస్తున్నాడనిపిస్తోంది. అందుకే ఒక్కొక్కరికి పాజిటివ్ కంటెంట్ ఇస్తున్నాడు. పృథ్వీ చేసే వరెస్ట్ గేమ్ ప్లేకి నత్తి బ్రెయిన్ విష్ణుప్రియ సపోర్ట్ ఉండటంతో బిగ్ బాస్ పృథ్వీ జోలికి కూడా పోవడం లేదు. ఇక యష్మీ.. గత సీజన్ లో శోభాశెట్టి.. ఈ సీజన్ లోన యష్మీ ..‌ఇలా తగులుకున్నారేంటని ట్రోల్స్ మాములుగా లేవు. మరో ఢిఫరెంట్ కంటెస్టెంట్ ప్రేరణ. పన్నెండు వారాలలో‌ ఒక్కసారి కూడా యష్మీ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ ఒకరినొకరు నామినేట్ చేసుకోలేదు. అందుకేనేమో వీరిని గ్రూప్ గేమ్ అని అందరు అంటున్నారు. ప్రేరణ కనపడకుండా యష్మీతో స్ట్రాటజీ ప్లే చేస్తోంది.

నిఖిల్ విన్నర్ అవుతాడనే అనుకున్నారంతా కానీ‌ అతని స్ట్రాటజీలన్నీ‌ నాగ మణికంఠ(Manikanta) బయటపెట్టేశాడు. అతడి ఫ్లిప్పింగ్ అండ్ నామినేషన్ లో స్ట్రాటజీ ఇలా అన్నింటిని బయటపెట్టి అతడి గురించి అందరికి తెలిసేలా చేశాడు. ఇక సీత వచ్చి నిఖిల్ హౌస్ లోని కొందరిని ఎలా మానిప్యులేట్ చేశాడో చెప్పింది. ఇక దీనిని కవర్ చేసుకోడానికి నిఖిల్ సింపథీ స్ట్రాటజీ వాడాడు. మొదటగా ఓట్లు వేయద్దని చెప్పి ఆ తర్వాత ఓట్లు చేయండి అంటు ఆడియన్స్ ని రిక్వెస్ట్ చేసుకున్నాడు. ఇక అందరికి ఓటింగ్ భారీగానే ఉంది. కానీ తెలుగు కంటెస్టెంట్ నబీల్ కి ఓటింగ్ చాలా దారుణంగా ఉంది. డేంజర్ జోన్ లో ఉన్నాడు. అసలు నబీల్ కి సంబంధించిన ఫుటేజ్ కూడా టెలికాస్ట్ కావడం లేదు. హౌస్ లో నబీల్ పెద్దగా కంటెంట్ ఏం ఇవ్వడం లేదని , కన్నడ బ్యాచ్ విచ్చలవిడిగా కంటెంట్ ఇస్తున్నారని వారికే సపోర్ట్ చేస్తారని ఆడియన్స్ భావిస్తున్నారు. ఈ వారం నబీల్ ని ఎలిమినేషన్ చేస్తారా ఆడియన్స్ గత కొన్ని వారాలుగా ఎదురుచూస్తున్న యష్మీ(Yashmi Elimination)ని బయటకి పంపిస్తారా చూడాలి మరి.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.