English | Telugu

బొచ్చు పీకి విసిరేసిన పృథ్వీ.. బిగ్ బాస్ హౌస్ లో రౌడీయిజం!

అసలేం జరుగుతుంది హౌస్ లో.. నిన్న మొన్నటి దాకా ఫ్యామిలీ వీక్ లో అందరి ఫ్యామిలీలు వచ్చి గ్రూప్ గా ఆడొద్దని యష్మీ, నిఖిల్, పృథ్వీ, ప్రేరణలకి చెప్పినా వాళ్ళు మాత్రం మారట్లేదు. తాజాగా రిలీజైన ప్రోమోలో గౌతమ్ మీదకి హై టెంపర్ తో పృథ్వీ వెళ్ళడం చూస్తే.. ఏం చిల్లర గాడురా వీడు అని కామన్ ఆడియన్ ఎవరైనా అనుకుంటారు.

పన్నెండు వారాల నుండి పృథ్వీది ఇదే బిహేవియర్.. అయిన సరే అతడికి సపోర్ట్ గా హౌస్ లో యష్మీ , నిఖిల్, ప్రేరణ ఉండగా.. బిబి టీమ్ ఎడిటింగ్ లో లేపేస్తున్నారు. ఇది కన్నడ బ్యాచ్ కి ఫేవరెటిజం అని స్పష్టంగా తెలుస్తుంది. అయిన సరే ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రోమోలో గౌతమ్ తన పాయింట్లు చెప్తున్నప్పుడు.. ఏం చేస్తావ్ రా నువ్వు.. నా బొచ్చు కూడా పీకలేవంటూ పృథ్వీ వెంట్రుకలు పీకి గౌతన్ మీదకి విసిరేయడం పెద్ద దుమారం లేపుతుంది. ఇది బిగ్ బాస్ షోనా లేక అల్లరి మూకలకి, కిరాయి గుండాలకి అడ్డానా అంటూ నెటిజన్లు కన్నడ బ్యాచ్ ని దూశిస్తూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

హౌస్ లో లాస్ట్ మెగా ఛీఫ్ కోసం జరుగుతున్న టాస్క్ లలో గౌతమ్ వర్సెస్ కన్నడ బ్యాచ్ గా మారిపోయింది. ఎంతలా అంటే గౌతమ్ ఏది మాట్లాడిన అతడి మీదకి యష్మీ, పృథ్వీ, నిఖిల్ వెళ్లడం అన్ ఫెయిర్ గా అనిపిస్తుంది. అంతకముందు నబీల్‌ని పృథ్వీ కొట్టడానికి వెళ్లినప్పుడు ఎవరు అడ్డుచెప్పలేదు. నీకు దమ్ము లేదు.. నేనే పెద్ద మొగాడ్ని అంటూ టేస్టీ తేజాని మీదకి వెళ్లినప్పుడు ఎవరు అడ్డుకోలేదు. నేను కొట్టడానికి వస్తా నువ్వు వెనక్కి వెళ్లిపోవాలి.. కాదని చేతులు అడ్డుపెడితే తొక్కిపడేస్తా అని వీధి రౌడీలా నిలువరించినప్పుడూ అడ్డు చెప్పలేదు. ఆడాళ్లని చూడకుండా బూతులు తిట్టినప్పుడూ కంట్రోల్ చేయలేదు.. నీ నోరు నీ ఇష్టం. ఎవడ్నైనా తిట్టు.. ఎవడ్నైనా కొట్టు అని యష్మీ, ప్రేరణ, నిఖిల్ ఎంకరేజ్ చేశారు. హౌస్ లో ఇప్పుడు ఎలా ఉందంటే ఇది తెలుగు బిగ్ బాస్ రా బై.. మీ కన్నడోళ్లకి నో ఎలిమినేషన్.. చేస్తే గీస్తే తెలుగోళ్లనే ఎలిమినేషన్ చేస్తాం. ఇప్పటికి పన్నెండు మందిని ఎలిమినేట్ చేశాం.. మిమ్మల్ని మాత్రం టచ్ చేయం.. చెలరేగిపోయండనే స్థాయిలో బిబి టీమ్ ప్రోత్సహిస్తున్నప్పుడు పృథ్వీ బొచ్చు పీకి గౌతమ్ మీద పారేయడంలో తప్పు లేదనిపిస్తోంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.