English | Telugu

మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ షాక్ ఇచ్చిన బిగ్ బాస్!

రోజు రోజుకి ట్విస్ట్ లతో ప్రేక్షకుల అంచనాలను దాటి వినోదాన్ని అందిస్తున్నాడు బిగ్ బాస్. స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇనయాని ఎలిమినేట్ చేసి అందరికి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ మరో షాక్ ఇచ్చాడు.

అయితే సోమవారం నుండి బుధవారం వరకు జరిగిన ఓటింగ్ లో ఎవరు లీస్ట్ లో ఉంటారో.. వారు మిడ్ వీక్ లో ఎలిమినేట్ అవుతారని.. నాగార్జున ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో చెప్పాడు. అయితే తాజాగా జరిగిన‌ ఓటింగ్ లో రోహిత్ రేవంత్ ల మధ్య మొదటి స్థానానికి పోటీ జరుగుతోంది. గంట గంటకి వీరి మధ్య ఓట్ల వ్యత్యాసం జరుగుతుంది. ఆయితే రోహిత్ జెన్యూన్ గా, జెంటిల్ మెన్ గేమ్ ఆడతాడు కాబట్టి ఈ సారి అతనే టైటిల్ విజేత అనే ఊహాగానాలు వస్తోన్నాయి.

కామన్ మ్యాన్ ఆదిరెడ్డి మూడవ స్థానంలో, శ్రీహాన్ నాల్గవ స్థానంలో, కీర్తి భట్ ఐదవ స్థానంలో ఉండగా, చివరి స్థానంలో శ్రీసత్య ఉంది. ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీసత్య దాదాపు బయటకొచ్చేస్తుందనే వార్త చక్కర్లు కొడుతుంది. అయితే ఈ రెండు రోజుల్లో శ్రీసత్యకి ఓటింగ్ ఎక్కువ అవుతుందేమో చూడాలి మరి.