English | Telugu
ఇన్నోసెంట్ మదర్స్ అంతరించిపోయారు..పెద్దాళ్ళను చంపేవాళ్లు మృగాలే
Updated : Dec 25, 2025
టేస్టీ తేజ ఒక జబర్దస్త్ కమెడియన్ గా అలాగే ఫుడ్ వ్లాగర్ అందరికీ పరిచయమే. అలాంటి తేజ ఒక ఇంటర్వ్యూలో ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. '90s జనరేషన్ కదా అప్పటికి ఇప్పటికీ నువ్వు గమనించిన మార్పులు ఏంటి" అంటూ హోస్ట్ అడిగేసరికి "మార్పులు ఏమీ లేవు కానీ ఒక మార్పు గట్టిగా కనిపిస్తోంది. ఇన్నోసెంట్ మదర్స్ అంటారు కదా అది మన జనరేషన్ తోనే ఎండ్.
అప్పటిలో మమ్మీస్ అంతరించిపోయారు అనేవాళ్ళు కదా అలా మన జనరేషన్ తోనే ఇన్నోసెంట్ మదర్స్ అంతరించిపోయారు. ఇన్నోసెంట్ మదర్స్ లేరు ఇన్నోసెంట్ ఫాదర్స్ లేరు. అందరూ ముదుర్లు. మనమే ముదుర్లు అంటే మనకు పుట్టే వాళ్ళు కంచులే. మనం ఇప్పటివరకు మా పేరెంట్స్ ఇన్నోసెంట్ అని చెప్పుకునే వాళ్ళం. కానీ రేపటి పిల్లలు మాత్రం మా పేరెంట్స్ ముదుర్లు అని చెప్పుకుంటారు. ఇది మేజర్ డిఫరెన్స్ నేను గమనించింది. ఐతే కొన్నేళ్ల క్రితం నేను చూసింది పేరెంట్స్ ని ఇంట్లోంచి గెంటేయడం లేదంటే అనాధాశ్రమాల్లో వేసేసేవాళ్ళు. కానీ ఇప్పుడు నెమ్మదిగా సెల్ఫ్ రియలైజేషన్ వచ్చింది. మమ్మల్ని కన్నారు పెంచారు కదా మేము చూడాలి కదా అనుకుంటున్నారు.
ఐతే ఆర్ధిక ఇబ్బందుల వలన అలా చేస్తున్నారు. కొంతమంది ఐతే పెద్దవాళ్ళు అడ్డుగా ఉంటున్నారని చంపేస్తున్నారు వాళ్ళను మృగాలు అనాలి. ఒకప్పుడు అవకాశాలు లేక అలా చేశారనుకుంటే ఇప్పడు అవకాశాలు పెరిగాయి. ఐనా కూడా చేస్తున్నారంటే ఏమీ చేయలేక లాస్ట్ ఆప్షన్ గా అలా చేస్తున్నారు అంటే అది దరిద్రం దారుణం ఇంకా వాళ్ళు మృగాలే." అని చెప్పాడు టేస్టీ తేజ.