English | Telugu
'నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు' రెడీ అన్న ఆర్పీ
Updated : Dec 12, 2022
జబర్దస్త్ కమెడియన్ గా కిర్రాక్ ఆర్పీ ఒకప్పుడు ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఐతే తర్వాత షో నుంచి నాగబాబు వెళ్లిపోయేసరికి ఆర్పీ కూడా వెళ్ళిపోయాడు. తర్వాత ఒక మూవీ తియ్యడానికి ట్రై చేసాడు కానీ దాని డీటెయిల్స్ ఏమీ తెలీదు.
ఇక జబర్దస్త్ గురించి సోషల్ మీడియాలో ఆర్పీకి మిగతా జబర్దస్త్ టీమ్ మెంబర్స్ కి బాగా గొడవలు కూడా జరిగాయి. అలా ఆర్పీ టీవీ షోస్ కి గుడ్ బై చెప్పేసి కొన్ని వెబ్ సిరీస్ లో నటించాడు. ఎక్కడా స్థిరంగా ఉండని ఆర్పీ ఇప్పుడు మళ్ళీ వార్తల్లో నిలుస్తున్నాడు. రెస్టారెంట్ బిజినెస్ లో అడుగుపెట్టి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. కూకట్ పల్లిలో "నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ పేరుతో రీసెంట్ గా ఓ రెస్టారెంట్ ఓపెన్ చేసాడు ఆర్పీ.
ఈ నెల్లూరు పెద్దారెడ్డి రెస్టారెంట్ ప్రత్యేకతల గురించి ఆర్పీ మాట్లాడుతూ.. ఈ రెస్టారెంట్ లో అన్ని వంటకాలు కట్టెల పొయ్యి పైనే వండుతామని.. పదేళ్ల కిందటే మొదలు పెడదామనుకున్న రెస్టారెంట్ కల ఇప్పటికి నెరవేరిందని చెప్పాడు. ఇదిలా ఉండగా.. కిరాక్ ఆర్పీ ఊరు నెల్లూరు అని తెలిసిన విషయమే. నెల్లూరు చేపల పులుసు అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఆ రుచిని హైదరాబాద్ వాసులకు అందించాలనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేసినట్లు చెప్పాడు.