English | Telugu

Brahmamudi: రేణుక మాటలతో ఆలోచనలో పడ్డ ధాన్యలక్ష్మి.. కావ్య బిజినెస్ మైండ్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -913 లో... గుడిలో అన్నదానం చేస్తానని పంతులికి ధాన్యలక్ష్మి డబ్బులు ఇస్తుంటే.. నువ్వు అన్నదానం చేయడం అత్తగారిగా నాకు ఇష్టం లేదని ఇందిరాదేవి అంటుంది. చేసేది మంచి పని అయినప్పుడు అందరికి నచ్చాల్సిన అవసరం లేదని ధాన్యలక్ష్మి అంటుంది. అయితే నీ కోడలు చేసింది తప్పని నీకెలా అనిపిస్తుంది, తను ఒక తల్లి బిడ్డని కాపాడిందని ఇందిరాదేవి అంటుంది.

దాంతో నేను చేసేది మీకు నచ్చలేదని అంటున్నారు కాబట్టి చెయ్యను అది కోడలుగా మీకు నేను ఇస్తున్న గౌరవం అని ధాన్యలక్ష్మి అంటుంది. పంతులు గారు ఇక నుండి అన్నదానం చెయ్యనని ధాన్యలక్ష్మి చెప్పి పంతులిని పంపిస్తుంది.

ఆ తర్వాత పంతులు గారు పిన్ని కోరుకున్నట్లు అన్నదానం జరిపించండి.. డబ్బులు నేను పంపిస్తానని పంతులికి చెప్పి పంపిస్తాడు రాజ్. కాసేపటికి అదేంట్రా ప్లాన్ ఇలా ఫెయిల్ అయిందని రాజ్ తో ఇందిరాదేవి అంటుంది. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఉందని రాజ్ అంటాడు.

మరొకవైపు రాహుల్ కంపెనీకి వచ్చిన క్లయింట్స్ అందరు కావ్య డిజైన్స్ నచ్చి వెళ్లిపోతున్నారని రాహుల్ కి మేనేజర్ ఫోన్ చేసి చెప్తాడు. దాంతో రాహుల్ కోపంగా ఉంటాడు. అప్పుడే రుద్రాణి వచ్చి రాజ్ బిజీగా ఉన్నాడు కాబట్టి అప్పుడు అలా సక్సెస్ అయ్యావ్.. ఇప్పుడు అలాగే చేసి మళ్ళీ నీ రూట్ క్లియర్ చేసుకోమని రుద్రాణి చెప్తుంది.

ఆ తర్వాత పాపని తీసుకొని ఇంటికి వస్తుంది రేణుక. అప్పు మేడమ్ వల్లే నా కూతురు నా దగ్గరికి వచ్చింది.. అలాంటి అప్పు మేడమ్ మీకు కోడలిగా వచ్చిందంటే మీ అదృష్టం అని ధాన్యలక్ష్మితో అప్పు గురించి రేణుక గొప్పగా చెప్తుంది. అక్క నీలాగే నేను పోలీస్ అవుతానని పాప చెప్తుంటే.. ధాన్యలక్ష్మి ఆలోచనలో పడుతుంది. ఆ తర్వాత ఏంటి ధాన్యం, అప్పు విషయంలో నిర్ణయం మార్చుకోలేకపోతున్నావా అని తనని మార్చాలని ప్రకాష్ ట్రై చేస్తాడు.

ఆ తర్వాత క్లయింట్స్ అందరు మన కంపెనీకీ వచ్చారని రాజ్ కి శృతి ఫోన్ చేసి చెప్తుంది‌. రాజ్ హ్యాపీగా ఫీల్ అవుతుంటే.. నేను ఒకసారి వాళ్లతో మాట్లాడాలి, మళ్ళీ ఇంకొకసారి వేరొక కంపెనీకి పోరని గ్యారెంటీ లేదని కావ్య అనగానే.. బిజినెస్ లో నన్ను మించి పోయావని కావ్య గురించి రాజ్ గొప్పగా చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.