English | Telugu
షో మధ్యలో గబ్బర్ సింగ్ కి కాల్ చేసిన ధన్ రాజ్!
Updated : Sep 2, 2022
ధన్ రాజ్ ఈ పేరు ఫుల్ స్క్రీన్ మీద స్మాల్ స్క్రీన్ మీద బాగా పరిచయమే. ఐతే జబర్దస్త్ కి ముందు చాలా సినిమాల్లో నటించాడు ధన్ రాజ్. ఐనా అనుకున్నంతగా పేరు రాలేదు. కానీ జబర్దస్త్ షోలోకి వచ్చేసరికి మాత్రం ఫుల్ ఫేమస్ అయ్యాడు. ధనాధన్ ధన్ రాజ్ గా మంచి పాపులారిటీ ఉన్న కమెడియన్ గా పేరు వచ్చేసింది. ఇక ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చి ఎంటర్టైన్ చేశారు.
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో ఉన్న రిలేషన్ ని గుర్తు చేసుకున్నారు. అలాగే తన మూవీ కూడా హిట్ కావాలని ఆయన ట్విట్టర్ లో పెట్టిన మెసేజ్ ని ఈ షోలో చూపించారు. ఇంతలో ఆది మధ్యలో వచ్చి "అన్నా..మీరెప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారా ? అని అడిగేసరికి ధన్ రాజ్ వెంటనే ఫోన్ తీసి ఆయనకి డయల్ చేశారు.
అటు నుంచి వెంటనే హలో ధన్ రాజ్ గారు అంటూ పవన్ వాయిస్ వినిపించింది. ఐతే అటునుంచి నిజంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా లేదంటే ఆయన వాయిస్ ని ఎవరైనా మిమిక్రీ చేశారా అనేది తెలియాలంటే ఆదివారం మధ్యాహ్నం వరకు ఆగాల్సిందే.