English | Telugu
పవన్ కళ్యాణ్ తో డేటింగ్ ఇష్టం అంటున్న సురేఖావాణి!
Updated : Sep 2, 2022
ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్న యాక్ట్రెస్ సురేఖా వాణి. తెలుగులో అమ్మ, వదిన రోల్స్ చేస్తూ హోమ్లీగా కనిపించే బ్యూటీ సురేఖ. ఏజ్ 50కి దగ్గరవుతున్నా కూతురు సుప్రీతతో కలిసి సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంటుంది. భర్త చనిపోయాక చాలా రోజులపాటు సురేఖవాణి బయట ఎక్కడా పెద్దగా కనిపించలేదు. ఈ మధ్య సుప్రీత తనను మొత్తం మార్చేసిందని సురేఖావాణి చెప్పుకొచ్చింది. ఇటీవల 'నిఖిల్ తో నాటకాలు' షోకి వచ్చిన సురేఖవాణి తనకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి అంటూ ఎలాంటి క్వాలిటీస్ అతనిలో ఉండాలో కూడా చెప్పి ఫన్ చేసింది.
సుప్రీత కూడా "అమ్మకి పెళ్లి చేసేస్తేనే బెటర్, లేదంటే నా బుర్ర తింటూ ఉంటది" అంటూ కామెడీ చేసింది. ఆ న్యూస్ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అయ్యింది. తర్వాత సుప్రీతకు మందు తాగిస్తూ సురేఖ చేసిన హడావిడి కూడా మస్త్ వైరల్ అయ్యింది. ఇక ఈ ఇంటర్వ్యూలో తల్లి గురించి ఎన్నో విషయాలు చెప్పింది సుప్రీత. వాళ్ళ నాన్న విషయంలో చాలా బాధపడిందని చెప్పింది.
అలాగే అమ్మకు వోడ్కా అంటే ఇష్టమని, డ్రెస్సింగ్ స్టయిల్లో శారీస్, మోడరన్ డ్రెస్సెస్ ఎక్కువగా ఇష్టం అని చెప్పింది. అలాగే డేటింగ్ చేయాల్సి వస్తే ఇండస్ట్రీలో ఎవరితో చేస్తుంది అని అడిగేసరికి "పవన్ కళ్యాణ్" అని చెప్పింది సుప్రీత.