English | Telugu

బాలకృష్ణ గారితో నటించా..వైఎస్ఆర్ చేతులమీదుగా నంది అవార్డు తీసుకున్నా


మానస్ నాగులపల్లి బుల్లితెర మీద ఇప్పుడు టాప్ హీరోగా ఉన్నాడు. బ్రహ్మముడి సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే ప్రైవేట్ ఆల్బమ్స్ తో కూడా మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. అలాగే కొన్ని వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్నాడు. బుల్లితెర మీద అన్ని షోస్ లో కనిపిస్తూ ఉన్నాడు. అలాగే మానస్ రీసెంట్ గా ఒక షో ఇంటర్వ్యూకి వచ్చి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాడు. "నేను బాలకృష్ణ గారితో నా ఫస్ట్ డెబ్యూ ఫిలిం నరసింహ నాయుడు మూవీ చేసాను. వైజాగ్ లో గురజాడ కళాక్షేత్రం కానివ్వండి కళాభారతి కానివ్వండి మనం చేయని డాన్స్ పెర్ఫార్మెన్సెస్ అంటూ ఏవీ లేవు. నేను వైజాగ్ బుల్లోడిని. బలకృష్ణ గారికి బ్రాండ్ ఉంది కానీ నాకు బ్రాండ్ తో సంబంధం లేదు. ఏదైనా ఓకే. గ్లాస్ మేట్స్ చాలా మంది ఉన్నారు. అమరదీప్ ఉన్నాడు అంటే గ్లాస్ పట్టుకుని వచ్చేస్తాడు. వాడికి ఇంటరెస్ట్ అన్నమాటా ఎక్కువ సేపు కూర్చోవాలి నాతో టైం స్పెండ్ చేయాలనీ ఉంటుంది. అమరదీప్ నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్.

ఇద్దరం కలిసి ఒక ప్రాజెక్ట్ చేసాం. నాకు బాగా గుర్తు..వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తొలిసారి సీఎం ఐనప్పుడు ఆయన చేతుల మీద అలాగే దాసరి నారాయణ రావు గారి చేతుల మీదుగా నంది అవార్డు తీసుకున్నా. నాకు అమర్ కి, నిఖిల్ కి, అంబటి అర్జున్ కి పోటీ విషయం ఏమో కానీ మనోడికి ఒక ఆరు నెలలు కంప్లీట్ బ్రేక్ వచ్చింది. అప్పుడు అతను బ్లేమ్ చేయడం స్టార్ట్ చేసాడు. నేను ఎక్స్పెక్ట్ చేశా ఇలా చేస్తాడని..ప్రియాంక సింగ్ అంటే కోపం, అభిమానం, ఇష్టం కానీ బిగ్ బాస్ వరకే. ఇప్పుడు అసలు టచ్ లో కూడా లేదు. నా వైఫ్ నాన్ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ ...ఐనా ఆడవాళ్ళకు కోపం కొంతవరకే. దేవుడు అంటే పవర్ నేను శివుడిని పూజిస్తాను. నీ చుట్టూ ఎవరు లేనప్పుడు, నిన్ను ఎవరూ నమ్మనప్పుడు కచ్చితంగా శివయ్యను నమ్మితే చాలా మంచి జరుగుతుంది.." అని చెప్పాడు మానస్.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.