English | Telugu

శివయ్య మీద ఒట్టు...సెకండ్ షోకి వెళదామా

కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ రాబోయే ఆదివారం ప్రోమో ఫుల్ జోష్ తో నిండిపోయి కనిపించింది. ఈ షోకి "భైరవం" మూవీ టీమ్ నుంచి బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, డైరెక్టర్ విజయ్ కనకమేడల, నిర్మాత రాధా మోహన్ వచ్చారు. ఈ మూవీ ప్రొమోషన్స్ కోసం రావడం ఏమో కానీ మంచు మనోజ్ వన్ మ్యాన్ ఎపిసోడ్ లా ఉండబోతోందా అని ఈ ప్రోమో చూస్తే అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడూ లేనంత జోష్ తో మనోజ్ ఫుల్ కామెడీని పంచాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ స్టేజి మీదకు రాగానే శ్రీముఖి ఐతే "హార్టీ వెల్కమ్ టు యు" అంది "లివర్ వెల్కమ్ టు యు" అంటూ మనోజ్ పంచ్ డైలాగ్ వేసేశాడు. అందరూ నవ్వారు.

తర్వాత జైల్లో ఉన్న శ్రీసత్యని చూసాడు. "పాపం ఆవిడ పరిస్థితి ఏమిటిప్పుడు" అని అడిగాడు. "ఆవిడ రెండు రోజుల నుంచి జైల్లోనే ఉందండి" అని చెప్పింది శ్రీముఖి. "పాపం ఒక్కతే ఉందిగా నేను కంపెనీ ఇస్తాను డోర్స్ తియ్యండి" అంటూ కౌంటర్ వేసాడు. తర్వాత ప్రొడ్యూసర్ రాధ మోహన్ ఐతే రౌడీ రోహిణితో డ్యూయెట్ డాన్సులు వేసి అందరినీ అలరించాడు. ఇక డైరెక్టర్ విజయ్ వచ్చి "ఇంతవరకు దిల్ రాజు గారికి పోటీ లేదనుకున్నాం కానీ మా ప్రొడ్యూసర్ రాధామోహన్ అంతకు మించి మంచి పోటీ ఇస్తున్నారు" అంటూ కౌంటర్ వేసాడు. తర్వాత "అనసూయ గారు భైరవం గురించి మీ మాటల్లో" అని శ్రీముఖి అడిగింది. అనసూయ చెప్పబోయేంతలోనే కామెడీగా మంచు మనోజ్ "టాక్ యా" అంటూ కామెడీ చేసాడు. "నేను ఇంకా సినిమా చూడలేదు...శ్రీనివాస్ గారు మీరు" అని అనసూయ అనేంతలా "సెకండ్ షోకి వెళదామా " అంటూ మనోజ్ మళ్ళీ ఆవిడని మాట్లాడనివ్వకుండా కామెడీ చేసాడు. "మీరు వర్క్ చేసిన ఇంతమంది డైరెక్టర్స్ లో మై ఫ్రెండ్ అనిపించే డైరెక్టర్ ఎవరు..విజయ్ గారు ఉన్నారు కదా అని విజయ్ గారు ఉన్నారు కదా అని ఆయన పేరు చెప్పొద్దూ" అంది. వెంటనే మనోజ్ మాత్రం విజయ్ వైపు వేలు చూపించాడు. "ఆ శివయ్య మీద ఒట్టేసి చెప్తున్నా" అన్నాడు మనోజ్. ఇలా ఈ వారం మనోజ్ ఈ షోలో ఫుల్ ఎంటర్టైన్ చేయబోతున్నాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.