English | Telugu
డాక్టర్ బాబు రీఎంట్రీ ఇక లేనట్లే ..క్లారిటీ ఇచ్చిన నిరుపమ్
Updated : Jun 8, 2022
బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్ తో హిట్ కొట్టి ప్రేక్షకుల హృదయాల్లో డాక్టర్ బాబుగా నిలిచిపోయిన నిరుపమ్ పరిటాల ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రశ్నలకు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మంజుల, నిరుపమ్ ఇద్దరూ సమాధానాలు ఇచ్చారు. ఐతే డాక్టర్ బాబు రీఎంట్రీ లేదని తేల్చి చెప్పేసారు. ఈ సీరియల్ నుంచి బయటికి వచేసాక ఒక వెబ్ సిరీస్ చేసినట్లు చెప్పారు. ఇప్పుడే దాని ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని కానీ డీటెయిల్స్ ఇప్పుడే చెప్పలేను అన్నారు. ఒకటి రెండు నెలల్లో ఒక సీరియల్ రాబోతోందని దాన్ని తానే ప్రొడ్యూస్ చేసినట్లు చెప్పారు. ఆ సీరియల్ లో మంజుల యాక్ట్ చేస్తోందని చిన్న ఇన్ఫర్మేషన్ లీక్ చేశారు నిరుపమ్.
అలాగే చాలామంది కూడా జాబ్స్ లేక ఇబ్బందిపడుతూ ఏదైనా జాబ్ ఇప్పించండి అంటూ రిపీటెడ్ గా అడుగుతున్న ప్రశ్నకు నిరుపమ్ కొంతమంది సక్సెస్ స్టోరీస్ చెప్పి వీళ్లంతా లైఫ్ లో సక్సెస్ సాధించారు కేవలం రీలెవెల్ అనే ప్లాట్ఫారం ద్వారా అంటూ దానికి సంబంధించి ఎన్నో డీటెయిల్స్ కూడా ఈ వీడియొలో షేర్ చేసుకున్నారు. చదువు అవసరం లేదు కేవలం స్కిల్స్ ఉంటే చాలు జాబ్ గారెంటీ అంటూ నిరుద్యోగులకు ఒక మంచి సజెషన్ కూడా ఇచ్చారు. ఇలా ఈ వీడియొలో చాలామందికి అవసరమైన సమాచారం అందించారు. నటులు అంటే కేవలం యాక్ట్ చేసి వెళ్లిపోవడమే కాదు తమని ఆదరిస్తున్న ప్రేక్షకులు అడిగే ప్రశ్నలకు జవాబులు కూడా ఇవ్వడం చాలా బాగుంది అంటూ నెటిజన్స్ పాజిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు