English | Telugu

Karthika Deepam2 : జ్యోత్స్న వాడిని కలవడం చూసేసిన పారిజాతం.. ఆ ఇంటికి వెళ్ళొద్దు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -349 లో.....కార్తీక్, దీప ఇద్దరు అసలు ఆ షూట్ ఎలా జరిగిందో అన్నివైపులా ఆలోచిస్తారు. ఒకవేళ జ్యోత్స్ననే షూట్ చేసి నీ లైఫ్ లోకి రావాలని ఇదంతా చేసిందేమోనని కార్తీక్ అంటుంటే నిజంగానే అలా జరిగే ఛాన్స్ ఉందా అని దీప అంటుంది. అదంతా తర్వాత ఆలోచిద్దాం కానీ నువు ఫస్ట్ పడుకో.. ఎన్ని రోజులు అవుతుందని కార్తీక్ అంటాడు.

మరుసటిరోజు జ్యోత్స్నని ఫాలో అవుతూ పారిజాతం వస్తుంది. జ్యోత్స్న ఎవరిని కలవడానికి వచ్చిందని పారిజాతం అనుకుంటుంది. తీరా చుస్తే జ్యోత్స్న దగ్గరికి సత్తిపండు వస్తాడు. బుల్లెట్ ఎందుకు మిస్ చేసావ్.. అక్కడ బుల్లెట్ తగిలిన వాళ్ళు బాగున్నారు.. ఆ దీప ఇంటికి వచ్చింది.. ఇప్పుడు నువ్వు దొరికితే నాకు సంబంధం లేదని జ్యోత్స్న అంటుంది. చేయించింది మీరే కదా అని సత్తి పండు అంటాడు. ఈ డబ్బు తీసుకొని ఎక్కడికైనా వెళ్ళమని జ్యోత్స్న అంటుంది. అసలు వాళ్ళేం మాట్లాడుకుంటున్నారని పారిజాతం చూస్తుంది. వాడిని ఎందుకు కలిసింది.. దాస్, దశరథ్ లపై ఎటాక్ చేసింది అదే అని తెలిస్తే మాత్రం ఈ పారిజాతం అంటే ఏంటో చూపిస్తానని పారిజాతం అనుకుంటుంది.

మరొకవైపు సుమిత్ర ఇంటికి దీప వెళ్తానని అంటుంటే.. దీపని తిడుతుంది అనసూయ. నీకు ఇదంతా అవసరమా గౌతమ్ మంచివాడు కాదని జ్యోత్స్నకి తెలుసు.. వాళ్ళు అపుకుంటారు. నువ్వు వెళ్లి అందరిచేత తిట్లు తిన్నావని అనసూయ తిడుతుంది. జ్యోత్స్న తన బావని దక్కించుకునే ప్రయత్నంలో భాగంగా గౌతమ్ తో చేతులు కలిపింది. గౌతమ్ మంచివాడు కాదు.. జ్యోత్స్న నన్ను అక్క అని పిలిచి తన ఇంట్లో చోటు ఇచ్చింది.. అందరు బాగుండాలి కార్తీక్ బాబు వాళ్ళు కలవాలని దీప అంటుంది. ఆ మాటలు అన్నీ కార్తీక్ వింటాడు. నువ్వు అనుకున్నది జరుగుతుంది కానీ ఇప్పుడు అయితే వాళ్ళ ఇంటికి వద్దని కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.