English | Telugu

Karthika Deepam 2 : కార్తీక్ కోసం వ్రతం చీరలో దీప.. అన్నీ మంచి శకునాలే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -189 లో... కార్తీక్ దగ్గరికి దీప వచ్చి.. మీ పక్కన కూర్చొని వ్రతం చెయ్యలేను బాబు.. మీరే ఎలాగైనా ఆపండని అంటుంది. ఇప్పుడు భర్తగా సమాధానం చెప్పాలా, శ్రేయోభిలాషిలాగా సమాధానం చెప్పాలా అని కార్తీక్ అంటాడు. శ్రేయోభిలాషి అనుకునే వచ్చానని దీప అంటుంది. సాయం చెయ్యాలంటే కాస్త కాలం వెనక్కి వెళ్ళి మాట్లాడుకుందాం.. గతంలో జరిగిన సంఘటనలు దీపకి చెప్తాడు. శౌర్యకి నువ్వు, నేను తప్ప ఎవరు లేరు.. ఏం చేసినా అది శౌర్య కోసమే అని అంటాడు.

అపుడే శౌర్య వచ్చి నాకు ఈ డ్రెస్ ఎలా ఉందని అడుగుతుంది. బాగుంది.. బుట్ట బొమ్మలాగా అని కార్తీక్ అంటాడు. అప్పుడే కాంచన వచ్చి.. మీ అమ్మని అడిగావా అంటుంది.‌ మా నాన్న చెప్తే అమ్మ చెప్పినట్లే ఇద్దరు ఒక్కటే అని శౌర్య అనగానే.. అవునని కాంచన అంటుంది. ఆ తర్వాత నీ కూతురు కి ఏది సంతోషమో అదే చెయ్ నేను ఏం అనను.. మా అమ్మకి మాటిచ్చావ్.. ఇంత చెప్పిన నీ ఇష్టం నీ సమాధానం చెప్పనవసరం లేదు.. వ్రతం చీరలో వస్తే పూజ జరుగుతుంది. లేదంటే పూజ ఆపేస్తానని కార్తీక్ బయట వెయిట్ చేస్తుంటాడు. ఆ తర్వాత కాంచన అనసూయ ఇద్దరు బయట వెయిట్ చేస్తుంటారు. కార్తీక్ దీప కోసం టెన్షన్ గా వెయిట్ చేస్తుంటాడు. అప్పుడే దీప వ్రతం చీరలో రావడం చూసి.. కార్తీక్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అనసూయ, కాంచన ఇద్దరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత అందరు కలిసి గుడికి బయలుదేర్తారు.

మరొకవైపు దీప, కార్తీక్ లు వ్రతం చేస్తున్న విషయం జ్యోత్స్నకి పారిజాతం చెప్పగానే.. తను ఆవేశంగా బయలుదేర్తుంది. పారిజాతాన్ని పక్కకు తోసేసీ వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుందంటూ సుమిత్ర వాళ్ళు అడుగుతారు. వ్రతం గురించి పారిజాతం చెప్పగానే అందరు గుడికి బయల్దేర్తారు. ఆ తర్వాత గుడికి స్వప్న, కాశీ, దాస్ లు వస్తారు. కార్తీక్, దీప లు పూజ మొదలుపెడ్తారు. ఆయన వచ్చినట్టున్నాడని కాంచన అంటుంది. కానీ వచ్చింది జ్యోత్స్న.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.