English | Telugu

Jayam serial :  గంగ లేదని వెతికిన ఇంట్లో వాళ్ళు.. తనని చూసి రుద్ర షాక్!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -73 లో... రుద్రని పార్క్ దగ్గరికి రమ్మని స్వీటీలాగా లొకేషన్ పెడుతుంది గంగ. దాంతో గంగ పంపిన లొకేషన్ కి వెళ్తాడు రుద్ర‌. అప్పటికే గంగ నర్స్ గెటప్ లో రెడీగా ఉంటుంది. ఇక రుద్ర తన దగ్గరికి రాగానే యాక్టింగ్ షురూ చేస్తుంది.

ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నట్లు, తనకి బోలెడన్ని కష్టాలంటూ చెప్తుంది. అసలేం జరిగిందని రుద్ర అడుగుతాడు. ఒకడు తనని ఏడ్పించాడని గంగ చెప్తుంది. వాడు ఎక్కడున్నాడని అడుగగా.. ఇక్కడే పార్క్ లోనే ఉంటాడని చెప్పాడంటూ గంగ అంటుంది. ఇక వాడి కోసం రుద్రని పార్క్ అంతా తిప్పుతుంది గంగ. ఎక్కడున్నాడఝటూ రుద్ర విసుక్కుంటాడు‌. అప్పుడే గంగ ఫ్రెండ్ అయిన ఒక బోండం గాడిని చూపిస్తుంది. ‌వాడిని చూసిన రుద్ర.. నిజంగా ఇతను నిన్ను ఏడ్పించాడా అని అడుగుతాడు. అవును.. వీడే అని గంగ అంటుంది. ఇక రుద్ర వాడి దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇస్తాడు.

ఇక రుద్రకి గంగ థాంక్స్ చెప్తుంది. అతను వెళ్ళిపోగానే గంగ పరుగెత్తుకుంటూ వెళ్తుంది. అదే సమయంలో పారు జాగింగ్ చేస్తూ గంగని డ్యాష్ ఇస్తుంది. ఇక ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఇక అప్పుడే రుద్ర కార్ లో ఉన్న చాక్లెట్లు చూసి పాపకి ఇవ్వాలని అనుకుంటాడు. ఇక వెంటనే ఆ చాక్లెట్ల కవర్ తీసుకొని గంగకి ఇవ్వడానికి బయల్దేరి వెళ్తాడు. అప్పటికే గొడవ జరిగి అందరు ఎక్కడివాళ్ళు అక్కడ వెళ్తారు. ఇక రుద్ర వచ్చి గంగకి చాక్లెట్లు ఇచ్చి.. పాపకి ఇవ్వమని చెప్పి వెళ్ళిపోతాడు. మరోవైపు పెద్దసారు ఇంట్లో గంగ కోసం వెతికి టెన్షన్ పడుతుంటాడు. రుద్రకి కాల్ చేసి గంగ కనపడటం లేదని చెప్తాడు. దాంతో రుద్ర కంగారుగా బయల్దేరి వెళ్తాడు. కాసేపటికి రుద్ర ఇంటికి వెళ్తాడు. అప్పటికే ఇంట్లోని వాళ్ళంతా ఒక దగ్గర ఉంటారు. గంగ కోసం ఇళ్ళంతా వెతికామని చెప్తారు. ఇక అప్పుడే గంగ ఒక బూజుకర్ర పట్టుకొని ఇల్లు క్లీన్ చేసినట్టు నటిస్తూ వస్తుంది. గంగని చూసి అందరు షాక్ అవుతారు. ఎక్కడికి వెళ్ళావ్.. ఇంట్లోని వాళ్ళంతా నీకోసం వెతికారని గంగపై పెద్దసారు, రుద్ర కోప్పడతారు. స్టోర్ రూమ్ కి వెళ్ళానంటూ గంగ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.