English | Telugu

Jayam serial: సొంత తమ్ముడిని చంపేస్తానన్న వీరు.. అతడిని చూసి గంగ షాక్!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -83 లో... నర్స్ నన్ను అవమానించిందన్న కోపంలో పారు ఉంటుంది. దాంతో వాళ్ళ అన్నయ్య నిన్ను అవమానించిన ఆ నర్సు ఈ కలర్ డ్రెస్ లో వచ్చిందో కనుక్కొని ఈ కలర్ డ్రెస్ పలాన హాస్పిటల్ డ్రెస్ కోడ్ అని అతను చెప్తాడు. దాంతో ఇద్దరు వెళ్లి ఆ నర్స్ పని చెప్పాలనుకుంటారు. గంగ హాస్పిటల్ కి వాటర్ క్యాన్ వేయడానికి వెళ్తుంది.

తన వెనకాలే మక్కం ఇంకా సెక్యూరిటీ తనని ఫాలో అవ్వమని రుద్ర చెప్పడంతో వాళ్ళు ఫాలో అవుతారు. అదే హాస్పిటల్ కి వీరు తన తమ్ముడు స్పృహలోకి వచ్చాడని వస్తాడు. అదే హాస్పిటల్ కి పారు ఇంకా వాళ్ళ అన్నయ్య బయల్దేరతారు. గంగ వాటర్ క్యాన్ మోస్తుంటే అక్కడికి రుద్ర పేషెంట్స్ ఎంక్వైరీ కోసం వస్తాడు. తనని చూసి గంగ దాక్కుంటుంది. త్వరగా క్యాన్ వెయ్యాలని అక్కడున్న నర్స్ డ్రెస్ వేసుకుంటుంది. మరొకవైపు తమ్ముడు నువ్వు త్వరగా కోమా నుండి లే అని అంటాడు. పక్కనే తన మనిషి ఉండి.. ఒకరకంగా చెప్పాలంటే మీ తమ్ముడికి ఈ సిచువేషన్ లోకి రావడానికి కారణం మీరే అనే విషయం మీ తమ్ముడికి తెలిసి మీకు అప్పోజిట్ అయితే పరిస్థితి ఏంటని అడుగుతాడు. వాడిని కూడా చంపేస్తానని వీరు అంటాడు. ఆ మాట తన తమ్ముడు వింటాడు. మరొకవైపు రుద్రకి కన్పించకుండా గంగ నర్స్ డ్రెస్ వేసుకొని క్యాన్లు మోస్తుంది.

గంగ క్యాన్లు మోస్తుంటే ఒకవైపు రుద్ర.. మరొకవైపు పారు ఉంటారు. దాంతో ఇద్దరికి కనిపించకుండా దాక్కుంటుంది. అప్పుడే డాక్టర్ నర్స్ అనుకొని గంగని పిలిచి పేషెంట్ కి ఇంజక్షన్ వెయ్యాలని వీరు వాళ్ల తమ్ముడున్న రూమ్ కి తీసుకొని వెళ్తాడు. అక్కడ వీరుని చూసి గంగ షాక్ అవుతుంది. వీరు తో ఉన్న ఇద్దరిని చూసి వీళ్ళు రుద్ర సర్ కి కోర్ట్ లో అప్పోజిట్ గా సాక్ష్యం చెప్పిన వాళ్ళు కదా‌‌.. వీళ్ళతో వీరు సర్ ఉన్నాడటని గంగ అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.