English | Telugu

Jayam serial : వైరల్ గా మారిన రుద్ర, గంగ ఫోటోస్.. చెలరేగిన పారు!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -111 లో.....గంగ ప్రాక్టీస్ చేస్తుంటే ఒకతను వచ్చి రుద్ర మీకు ఇది ఇవ్వమ్మన్నాడని చెప్తాడు. మీరు సర్ కి స్పెషల్ అనుకుంటా అందుకే ఈ చీర పంపాడు సర్ వచ్చేసరికి కట్టుకోండి అని అతను చెప్తాడు. దాంతో గంగ మురిసిపోతుంది. నేను పట్టీలు తీసుకోలేదని సర్ కి కోపం వచ్చింది.. ఇప్పుడు ఈసారి కట్టుకొని సర్ హ్యాపీగా ఫీల్ అయ్యేలా చెయ్యాలని గంగ అనుకుంటుంది.

మరొకవైపు ఇంట్లో చీర కనిపించడం లేదని అందరు వెతుకుతారు. ఇందాక నువ్వు బయటకు ఫోన్ మాట్లాడడానికి వెళ్ళావ్ కదా బావ అని వీరు అంటాడు. అవును గంగ ఫోన్ చేసిందని రుద్ర అనగానే.. ఆ గంగతో నీకు మాటలేంటి నీ ఫోన్ ఇవ్వు ఇంకొకసారి ఫోన్ చేయకని చెప్తానని శకుంతల అంటుంది. రుద్ర ఫోన్ తీసుకుంటుంది. అప్పుడే గంగ ఫోన్ చేసి సర్ మీరు పంపిన చీర బాగుంది కట్టుకున్నానని చెప్తుంది. అది విని ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. అదేంటీ రుద్ర చీర అక్కడికి ఎలా వెళ్ళిందని శకుంతల అడుగుతుంది. ఏమో అమ్మ నాకు తెలియదని రుద్ర అంటాడు. ఒకవేళ గంగ వచ్చి తీసుకొని వెళ్లి ఉంటుందని వీరు అంటాడు. అసలు ఏం జరిగిందో నేను కనుక్కుంటానని గంగ దగ్గరికి రుద్ర బయల్దేరతాడు. మరొకవైపు చీర ఇచ్చిన అతను రుద్ర, గంగ మాట్లాడుకునే ప్లేస్ లో ఆయిల్ పోస్తాడు. గంగ వస్తు పడిపోతుంటే రుద్ర పట్టుకుంటాడు. దాంతో అతను ఫోటో తీస్తాడు. గంగ చెంప చెల్లుమనిపిస్తాడు రుద్ర. పారు మీద కోపంతో ఈ చీర దొంగతనం చేస్తావా అని కోప్పడతాడు. గంగ ఏం చెప్పినా వినకుండా ఆ చీర తీసి ఇవ్వు అనగానే గంగ చీర మార్చుకొని వచ్చి రుద్రకి ఇస్తుంది.

రుద్ర ఇంటికి వెళ్లేసరికి రుద్ర, గంగ ఉన్న ఫొటోస్ చూసి పారు కోపంగా అన్ని వస్తువులు విసిరేస్తుంది. రుద్ర రాగానే ఆ ఫోటోస్ చూపిస్తుంది. ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయని వీరు చెప్తాడు. రుద్ర తెచ్చిన చీరని పారు కాల్చేస్తుంది. మరొకవైపు గంగ ఇంటికి వెళ్ళాక ఆ ఫోటోస్ చూసి పైడిరాజు కోప్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.