English | Telugu

నేను ప్రేమించే అమ్మాయి...అమ్మాయా...కాదా


జబర్దస్త్ కమెడియన్స్ లో ప్రముఖంగా ఇమ్మానుయేల్ పేరు చెప్పుకోవచ్చు. జబర్దస్త్ సైడ్ కమెడియన్ నుంచి టీంలీడర్ అయ్యాడు. అలాగే కొంతవరకు మంచి స్కిట్స్ చేస్తూ అలరిస్తున్నాడు. ఇక ఒక చిట్ చాట్ లో రకరకాలల ఆన్సర్స్ ఇచ్చాడు. "నేను ఇంత యాక్టివ్ గా ఉండడానికి కారణం ఏంటంటే బేసిక్ గా నా బండి యాక్టివ్. మిగతా వాళ్లందరితో నేను జోవియల్ గా ముచ్చట్లు చెప్పుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాను. లవ్ లెటర్స్ రాసే రోజులు కావు ఇవి. ఎవరూ నాకు లవ్ లెటర్స్ రాయలేదు. కానీ బాగా చేస్తాను అని అందరూ మెచ్చుకుంటారు. కోపాన్ని ఎప్పుడూ చూపించను నేను. ఐతే నేను ఒక అమ్మాయిని ప్రేమించాలి అంటే ముందు నేను అసలు అమ్మాయా కాదా అని చూస్తాను ఎందుకంటే ఈరోజున ఎవరినీ నమ్మే పరిస్థితి ఉండడం లేదు. చేసిన సినిమాలు అవీ సరిగా ఆడనప్పుడు కొంచెం బాధపడతాను. నేను యాక్టింగ్ ఎక్కడా నేర్చుకోలేదు.

జబర్దస్త్ లో వెళ్ళాను, వాళ్ళను చూసే నేర్చుకున్నా. ఒకవేళా నేను ఆర్టిస్ట్ ను కాకపోయి ఉంటె పెళ్ళైపోయి పిల్లల తండ్రిని అయ్యేవాడిని. ప్రస్తుతం నా క్రష్ నేషనల్ క్రష్ రష్మిక మందాన్న. నేను బాగా వంట చేస్తా. అందులో మజ్జిగ బాగా వండుతా...నా కెరీర్ ఇప్పుడు మూడు షూటింగులు ఆరు పేమెంట్లుగా నడుస్తోంది." అంటూ నవ్వించాడు ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ "ప్రేమ వాలంటీర్" అంటూ ఇటీవల ఓ వెబ్ సిరీస్ చేశాడు. జబర్దస్త్ షో బాగా పాపులర్ అయిన జంట ఇమ్ము-వర్ష.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.