English | Telugu

కూతురి అల్లరి.. "స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయిరా నాయనా" అని వాపోయిన ర‌వి!

యాంకర్ రవి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. భార్య, కూతురితో కలిసి రవి చేసే అల్లరిని నెటిజన్లు ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా రవి కూతురు వియాకు నెట్టింట్లో ఫుల్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆమె మాట్లాడే ముద్దు ముద్దు మాటలకు అందరూ ఫిదా అవుతుంటారు. దీంతో రవి తన కూతురితో తరచూ వీడియోలు చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటాడు.

రీసెంట్ గా ఇంట్లో వంటలు చేస్తూ వాటిని వియాకి తినిపిస్తూ వీడియోలు షేర్ చేశాడు రవి. తాజాగా మరో ఫన్నీ వీడియో పోస్ట్ చేశాడు. రవి ఇంట్లో వర్కవుట్ చేస్తుండగా.. వియా కాసేపు వర్కవుట్ చేయనివ్వకుండా డిస్టర్బ్ చేసింది. ఆ తరువాత తండ్రితో కలిసి తను కూడా వర్కవుట్ చేసింది. ఈ వీడియోకి 'రాకాసి గడుసు పిల్ల.. శివకాశి సరుకీ పిల్ల' అనే పాటను బ్యాక్ గ్రౌండ్ లో యాడ్ చేసి వీడియో పోస్ట్ చేశాడు.

''వియా నా చుట్టుపక్కల ఉన్నప్పుడు అసలు పని మీద దృష్టి పెట్టలేను. స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయ్ రా నాయనా'' అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు రవి. ప్రస్తుతం రవి బుల్లితెరపై కొన్ని టీవీ షోలతో బిజీ అయ్యాడు. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఇంట్లో ఉంటూ తన యూట్యూబ్ ఛానెల్ మీద ఫోకస్ పెట్టాడు. వెరైటీ కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.