English | Telugu

స్కిట్ తెచ్చిన తంటా.. క్షమాపణలు కోరిన హైపర్ ఆది!

'జబర్దస్త్' కమెడియన్ హైపర్ ఆది తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కించపరిచేలా 'శ్రీదేవి డ్రామా కంపనీ' షోలో ఓ స్కిట్ చేశాడని.. అతడిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్స్ ఫెడరేషన్ ఇటీవల ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. హైపర్ ఆదితో పాటు స్క్రిప్ట్ రైటర్, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గొడవ ముదిరిపోతుందని గ్రహించిన మల్లెమాల టీమ్ యూట్యూబ్ నుండి వీడియోను తొలగించింది.

ఈ వివాదంపై హైపర్ ఆది స్పందించక తప్పలేదు. తను కేవలం ఆర్టిస్ట్ ను మాత్రమేనని స్క్రిప్ట్ తను రాయలేదని చెప్పాడు. తాజాగా తమ స్కిట్ కారణంగా బాధపడ్డ వాళ్లకు క్షమాపణలు చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు హైపర్ ఆది. ఆంధ్ర, తెలంగాణ అనే బేదాభిప్రాయాలు తమ షోలో ఎప్పుడూ ఉండవని ఈ వీడియోలో వివరించాడు.

అన్ని ప్రాంతాల వాళ్లం ఎంతో సరదాగా కలిసిమెలిసి పని చేసుకుంటూ ఉంటామని.. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా.. కలిసే పరిష్కరించుకుంటామని తెలిపాడు. 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో చేసిన స్కిట్ పై కొన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ.. అవి ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాదని స్పష్టం చేశాడు. అన్ని ప్రాంతాల వారి ప్రేమాభిమానాలు వలనే అందరినీ ఇలా ఎంటర్టైన్ చేయగలుగుతున్నామని చెప్పాడు. ఏది ఏమైనా 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో జరిగిన దానికి అందరి తరపున క్షమాపణ కోరుతున్నట్లు చెప్పుకొచ్చాడు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.