Read more!

English | Telugu

శేఖర్ మాస్టర్‌తో డాన్స్ ఎంజాయ్ చేసిన‌ శ్రీముఖి!

 

టాలీవుడ్ లో స్టార్ కొరియోగ్రాఫర్ గా మారారు శేఖర్ మాస్టర్. ఆయన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతుంటారు. ఆయన కొరియోగ్రఫీ చేశారంటే ఆ సాంగ్‌ సూపర్ హిట్ అవ్వాల్సిందే. అలా వెండితెరపై తన సత్తా చాటుతున్న శేఖర్ మాస్టర్ బుల్లితెరపైకి కూడా వచ్చారు. పలు షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. మొన్నటివరకు 'ఢీ' షోలో జడ్జిగా కనిపించిన శేఖర్ మాస్టర్ ఇప్పుడు కొన్ని కామెడీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. 

మరోపక్క యాంకర్ శ్రీముఖి పలు ఎంటర్టైన్మెంట్ షోలతో బుల్లితెరపై దూసుకుపోతోంది. తన గ్లామర్, కామెడీ పంచ్ లతో అలరిస్తోంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా ఈ బ్యూటీ శేఖర్ మాస్టర్ తో కలిసి డాన్స్ వేసింది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. 

వీరిద్దరూ కలిసి ఓ తమిళ పాటకు డాన్స్ చేశారు. ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ కాస్త లోపించిందని చెప్పిన శ్రీముఖి.. శేఖర్ మాస్టర్ తో కలిసి డాన్స్ చేయడాన్ని ఎంతో ఎంజాయ్ చేశానని తెలిపింది. ఈ డాన్స్ వీడియో చూసిన విష్ణుప్రియ.. 'సూపర్ మచ్చి మచ్చా' అంటూ కామెంట్ పెట్టింది. శ్రీముఖి ఫ్యాన్స్ కూడా చాలా బాగా డాన్స్ చేశారంటూ రియాక్ట్ అవుతున్నారు.