English | Telugu

ఆయన నోరు విప్పితే బీప్ తప్పదు!


హైపర్ ఆది మొదట్లో చాలా లైట్ గా కామెడీ చేస్తూ బాగా ఎంటర్టైన్ చేసేవాడు. కానీ నెమ్మది నెమ్మదిగా ఆ కామెడీ టైమింగ్ ని పెంచుకుంటూ వెళ్ళాడు. ఐతే కొంత వరకు ఆది పంచులు పేలతాయి కానీ ఎక్కువశాతం మాత్రం సెన్సార్ చేయాల్సిన బూతు పదాలు వాడేస్తూ చిరాకు తెప్పిస్తుంటాడు. అతను వేసే పంచులకు ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే ఆది ప్రతీ ఒక్కరినీ బాడీ షేమింగ్ చేసి వంకర పదాలతో అడల్ట్ వర్డ్స్ ఇష్టమొచ్చినట్టు వాడేసి వాళ్ళను స్టేజి మీద కించపరిచే వరకు ఊరుకోడు.

ఇప్పుడు తాజాగా 'ఢీ 14' లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే ఈ షోకి నైనిక, శ్వేతానాయుడు టీంలీడర్స్ గా వచ్చారు. వాళ్ళతో డైలాగ్స్ చెప్పించారు. "ఢీకి కొత్తగా వచ్చామని చెప్పి పంచులేస్తున్నావా? ఇప్పటినుంచి చూడు కుమ్మేస్తా?" అంటూ ఆదికి వార్నింగ్ లాంటిది ఇస్తుంది శ్వేత... వెంటనే నైనిక "నేనూ దున్నేస్తా".. అనేసరికి ఆది రివర్స్ డైలాగ్ వేస్తాడు.

ఐతే అతను వాడిన పదాలను బీప్ సౌండ్ తో సైలెంట్ చేసి ఆ తర్వాత తినేస్తా అనే పదాన్ని మాత్రం వినేలా పెట్టారు. ఇక ఈ డబుల్, త్రిబుల్ మీనింగ్ డైలాగ్ తో ఏదో స్కిట్ పేలుతుంది అనుకుంటున్నాడు కానీ దాన్ని మాత్రం మార్చుకోవడాని ట్రై చెయ్యట్లేదు హైపర్ ఆది. ఇంటిల్లిపాది కూర్చొని చూసే షోలో ఇలాంటి చెత్త పదాలు వాడితే టీఆర్పీ వచ్చే విషయం ఏమో కానీ అసలే అంతతమాత్రంగా నడిచే షో కాస్త దుకాణం సర్దుకునే పరిస్థితి మాత్రం వస్తుంది. ఆడియన్స్ కూడా కొంతవరకు ఇలాంటివి వినగలుగుతారు కానీ అదే పనిగా వినాలంటే అసలుకే మోసం వస్తుంది.

ఆల్రెడీ ఇది డాన్స్ షో కాదు కామెడీ షో ఐపోయిందనే అపవాదు వచ్చింది. ఇక ప్రోమో ఎండింగ్లో మాత్రం ఆది, రవికృష్ణ కామెడీ, అంత్యాక్షరి కొంత వరకు ఫర్లేదనిపించాయి. ఇక స్టేజి మీద ఏర్పాటు చేసిన ట్రామ్పోలిన్ మీద ఇద్దరు ఎగురుతూ, దూకుతూ, దొర్లుతూ మంచి ఫన్ క్రియేట్ చేశారు. ఇలా ఈ వారం 13 న ప్రసారం కాబోయే ఢీ షోలో ఈ హైలైట్స్ కనిపించబోతున్నాయి.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.