English | Telugu
నయని - విశాల్ గృహ ప్రవేశంలో తిలోత్తమ కుట్ర!
Updated : Jul 11, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `త్రినయని`. గత కొన్ని వారాలుగా జీ తెలుగులో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ చిత్ర విచిత్రమైన మలుపులు, ట్విస్ట్ లతో సాగుతూ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సీరియల్ గత కొన్ని వారాలుగా జీ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ మంచి రేటింగ్ తో సాగుతోంది. అషికా గోపాల్, చందూ గౌడ జంటగా నటించారు. ఇతర పాత్రల్లో పవిత్ర జయరామ్, నిహారిక హర్షు, భావనా రెడ్డి, ద్వారకేష్ నాయుడు, విష్ణుప్రియ, సురేష్ చంద్ర, అనిల్ చౌదరి, శ్రీసత్య తదితరులు నటించారు.
కసి కారణంగా తిలోత్తమ ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడుతుంది. ఇన్వెస్టర్లు కోర్టుకు వెళ్లడంతో తిలోత్తమ ఆస్తులన్నింటిని జప్తు చేస్తారు. అంతే కాకుండా తిలోత్తమ ఫ్యామిలీ అంతా వుంటున్న ఇంటిని కూడా కోర్టు స్వాధీనం చేసుకుని సీలు వేస్తుంది. దీంతో తిలోత్తమ ఫ్యామిలీ అంతా రోడ్డున పడతాడరు. బయటికి వచ్చిన తిలోత్తమ ఫ్యామిలీకి విశాల్, నయని కార్లలో ఎదురుపడతారు. నయని మహారాణిలా గెటప్ మార్చి రెబాన్ గ్లాస్ ధరించి కార్ దిగుతుంది. తనని చూసిన ధురందర, కసి, తిలోత్తమ, వల్లభ ఒక్కసారిగా షాక్ కు గురవుతారు.
విశాల్ పెద్ద మనసు చేసుకుని అందరిని కొత్తగా నిర్కమించిన గాయత్రీ నిలయానికి తీసుకెళతాడు. గృహప్రవేశానికి ఏర్పాట్లు జరుగుతుంటాయి. అయితే ఇదే సమయంలో నయనికి తన భర్త విశాల్ కు హోమానికి ఏర్పాటు చేసిన ఇటుకల కారనంగా తలకు బలబైన గాయం అయినట్టుగా మనో నేత్రం ద్వారా తెలుస్తుంది. ఈ పనికి తిలోత్తమ పూనుకుంటుంది. విషయం తెలిసి నయని తన భర్తకు గాయం కాకుండా ప్రతిఘటించిందా?.. తిలోత్తమ చేసిన కుట్రని బయటపెట్టిందా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.