English | Telugu
ఆర్య - అను మలేసియా జర్నీ విషాదంగా మారనుందా?
Updated : Jul 11, 2022
కొంత కాలంగా జీ తెలుగులో విజయవంతంగా ప్రసారం అవుతున్న `ప్రేమ ఎంత మధురం` సీరియల్ ట్విస్ట్‌లు, మలుపులతో మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సీరియల్ ఆసక్తికర మలుపులతో ఆద్యంతం అలరిస్తోంది. శ్రీరామ్ వెంకట్, వర్ష హెచ్.కె. జంటగా నటిస్తున్నారు. బెంగళూరు పద్మ, జయలలిత, విశ్వమోహన్, రాం జగన్, రాథాకృష్ణ, జ్యోతిరెడ్డి, కరణ్, అనుషా సంతోష్, సందీప్, మధుశ్రీ తదితరులు ఇతర పాత్రధారులు.
రాగసుధ జైలుకి వెళ్లడంతో ఆర్య, అను రిలాక్స్ అవుతారు. ఈ సంతోష సమయాన్ని హనీమూన్ గా మార్చుకోవాలని ఆర్య - అను మలేసియాకు ప్రయాణమవుతారు. ఫ్లైట్ లో సమస్య కారణంగా రాజమండ్రి సమీపంలో వున్న మధురపూడిలో ల్యాండవుతుంది. అక్కడ స్టే చేసిన ఆర్య, అను అక్కడికి దగ్గరలో వున్న కపోతేశ్వరాలయానికి వెళతారు. అక్కడ ఆర్యని ఓ ముఠా వెంబడిస్తుంది. వారి ఆట కట్టించిన ఆర్య ఆ తరువాత అనుతో కలిసి ఎంజాయ్ చేస్తాడు.
ఫ్లైట్ రిపేర్ కావడంతో తిరిగి అను - ఆర్య మలేసియాకు బయలుదేరతారు. అను ఈసారి మరింత హుషారుగా కనిపిస్తుంది. విండో సీట్ లో కూర్చుని ఆర్యలో జోష్ పెంచుతుంది. ఇంతలో ఫ్లైట్ క్రాష్ అవుతుంది. ఓ పక్క ఫ్లైట్ రెక్కల్లో పొగలు చిమ్ముతుంటాయి.. ఆ తరువాత ఏం జరిగింది?.. ఇది నిజమా లేక దర్శకుడు ఈ సీన్ ని కలగా మార్చి ట్విస్ట్ ఇవ్వబోతున్నాడా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.