English | Telugu

పృథ్వీ, గౌతమ్ ల మధ్య జరిగిన గొడవలో తప్పెవరిది?

బిగ్ బాస్ సీజన్-8 పన్నెండో వారం మెగా ఛీఫ్ కోసం జరిగే టాస్క్ లలో‌ కంటెస్టెంట్స్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. హౌస్ మేట్స్ అందరికి మెగా చీఫ్ కంటెండర్ అయ్యో టాస్క్ ఇచ్చాడు.

ఇక నిన్నటి ఎపిసోడ్ లో విష్ణుప్రియ, యష్మీ, పృథ్వీ, తేజ కంటెండర్ షిప్ పొందుతారు రోహిణి, నిఖిల్ లలో ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే కంటెండర్ షిప్ ని పొందుతారుని బిగ్ బాస్ చెప్పాడు. ఇద్దరిలో నుండి ఒకరిని హౌస్ మేట్స్ కంటెండర్ ని చెయ్యొచ్చని బిగ్ బాస్ మెలిక పెట్టాడు. ఆ తర్వాత రోహిణి నిఖిల్ లు ఇద్దరు కూడా మెగా చీఫ్ అవ్వాలని అనుకుంటున్నామని చెప్తారు. మొదటగా గౌతమ్ వస్తాడు‌. తనకి రోహిణి అవ్వాలని ఉందని చెప్తాడు. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ రాకముందు అందరు కూడా వైల్డ్ కార్డ్స్ ని ఒక్కొక్కరిగా పంపించాలనుకున్నారు. అది గ్రూప్ గేమ్ అని గౌతమ్ అంటాడు.

ఇక ఇలా ఒక్కో హౌస్ మేట్ తమ సపోర్ట్ ఎవరికో చెప్తారు. ఇలా చెప్పిన వారిలో‌ మెజారిటీగా రోహిణికి సపోర్ట్ చేస్తారు. నబీల్ పృథ్వీ, విష్ణులు నిఖిల్ కి సపోర్ట్ చేస్తారు. పృథ్వీ తన ఒపీనియన్ చెప్తూ.. ఇందాక గౌతమ్ ఒక మాట అన్నాడు. అది కంప్లీట్ తప్పు ఎందుకంటే బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీకి ముందే వైల్డ్ కార్డు అనే సునామినీ మీరు ఆపాలని చెప్పారంటు పృథ్వీ అందుకున్నాడు.

ఒక సందర్బంలో అలా ఆడాము.. కానీ ఇప్పుడు అంతా ఒకటే అని పృథ్వీ వివరణ ఇస్తాడు. కానీ పృథ్వీ దగ్గరగా వెళ్లి మాట్లాడేసరికి గౌతమ్ కి కోపం వస్తుంది. అలా మాట మాట పెరిగిపోతుంది. ఇక గౌతమ్ ని ఇష్టమొచ్చినట్టు మాట్లాటతాడు పృథ్వీ. నా ఇష్టమంటు రెచ్చిపోతాడు పృథ్వీమ ఇక అదే హీటెడ్ ఆర్గుమెంట్స్ లో నువ్వే పీకలేవని గౌతమ్ అనగా.. అలా మాట్లాడొద్దని పృథ్వీ అంటాడు. ఆ తర్వాత పృథ్వి కూడా నా బొచ్చు కూడా పీకలేవని తన వెంట్రుక పీకి గౌతమ్ మీద పడేస్తాడు. ఇలా ఇద్దరి మధ్య తీవ్రంగా గొడవ సాగింది. ఎలాగైనా వీకెండ్ ల్ నాగార్జున ఇద్దరికి గట్టిగా వాయించేస్తాడని క్లియర్ గా అర్ధమవుతుంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.