English | Telugu

ఫరియా బాయ్ ఫ్రెండ్ హైట్ తెలుసా..?

ఆహా ప్లాట్‌ ఫామ్‌ మీద డాన్స్ ఐకాన్ సీజన్ 2 కలర్ థీమ్ తో మన ముందుకు ప్రేమికుల రోజున రాబోతోంది. ఇక ఈ సీజన్ ప్రోమో చూస్తే ఫుల్ జోష్ తో ఉంది. హోస్ట్ గా యాంకర్ ఓంకార్ ఉన్నారు. ఇక జడ్జెస్ గా ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ వచ్చారు. యష్ మాష్టర్, జానులూరి, బ్రహ్మముడి మానస్, దీపిక రంగరాజు, ‘మిస్‌ తెలంగాణ- 2024’ టైటిల్‌ విజేత ప్రకృతి కంబం, రోహిణి వచ్చారు.

ఇక ఫరియా హైట్ ఎంతో తెలుసు కదా 6 ఫీట్ ఉంటుంది. అంత హైట్ ముందు అదే హైట్ అబ్బాయి ఉంటేనే కనిపిస్తారు. దాంతో ఓంకార్ కి డౌట్ వచ్చి "మీకు రియల్ లైఫ్ లో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా" అంటూ ఒక చిన్న రెడ్ పప్పీ బొమ్మను ఇస్తూ అడిగాడు. దానికి ఫరియా సిగ్గు పడుతూ ఉన్నాడు అని చెప్పింది. "మీ బాయ్ ఫ్రెండ్ హైట్ ఎంత" అని అడిగాడు "ఆల్మోస్ట్ సిక్స్" అని చెప్పింది. తర్వాత యష్ మాస్టర్ వచ్చారు. "నువ్వు ఇప్పటి వరకు ఎంతమందిని కిస్ చేసావ్" అని అడిగాడు ఓంకార్. "15 ఏళ్ళ క్రితం ఫస్ట్ కిస్ చేసాను" అని చెప్పేసరికి . "సర్ నేను వెళ్ళిపోతా..ఈ అబద్దాలు నమ్మను" అంటూ చెప్పాడు శేఖర్ మాష్టర్.

ఇక దీపికా రంగరాజు నాన్ సింక్ స్టెప్స్ తో డాన్స్ చేస్తూ వచ్చింది. ఓంకార్ చాక్లెట్ ఇవ్వగా, అది తీసుకుని తింటూ శేఖర్ మాస్టర్ కి తినిపించబోయేసరికి భయపడి పారిపోయాడు. తర్వాత దీపికా నడుమును వర్ణించమంటూ మానస్ కి చెప్పాడు ఓంకార్. "యష్ మాష్టర్ అంత దగ్గర నుంచి చూస్తూ ఆయనే వర్ణించలేకపోతున్నాడు నేనేం వర్ణిస్తాను" అన్నాడు. "యష్ మాష్టర్ నడుమును చూడమంటే వేరే ఎక్కడో చూస్తున్నాడు" అని యష్ పరువు మొత్తం తీసేసింది దీపికా.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.