English | Telugu

Eto Vellipoyindhi Manasu : సీతాకాంత్ ను చంపడం కోసం సందీప్ స్కెచ్.. ఆమె ఏం చేస్తుంది?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -252 లొ.....శ్రీవారు అలిగారు.. ఇంట్లో అయితే ఉండమన్నారు కని గదిలో ఉండమంటాడో లేదో అని సీతాకాంత్ కోసం రామలక్ష్మి వెయిట్ చేస్తుంటుంది. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. రామలక్ష్మి గదిలో నుండి బయటకు వెళ్తుంటే వద్దని అంటాడు. దాంతో రామలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది.

మరుసటి రోజు సందీప్ అప్పున్న అతనికి ఫోన్ చేసి.. ఇలా నీ దగ్గర అప్పు చెయ్యాల్సిన అవసరం లేదు.. ఇక నేను చెప్పినట్టు చేస్తే డబ్బులు రెట్టింపు ఇస్తానని సందీప్ అంటాడు. ఏం చెయ్యాలని అతన్ని అడగగా.. మా అన్నయ్య సీతాకాంత్ ని చంపెయ్యాలని చెప్పగానే అతను సరే అంటాడు. అదంతా రామలక్ష్మి విని షాక్ అవుతుంది. ఆ తర్వాత ఇక అన్నయ్యని చంపడానికి ప్లాన్ చేసాను మమ్మీ అని శ్రీలతకి సందీప్ చెప్తుంటే.. రామలక్ష్మి వచ్చి అతని చెంప చెల్లుమనిపిస్తుంది. శ్రీలత కోప్పడుతుంటే నీక్కూడా ఇదే జరుగుతుందని రామలక్ష్మి అంటుంది. మీరు అనుకుంటున్న ప్లాన్ విరమించుకోండి అని వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి ఆవిషయం సీతాకాంత్ కి చెప్పి మీ వళ్లే ఆస్తులు కోసం ఇదంతా చేస్తున్నారని చెప్పడంతో సీతాకాంత్ కోపంగా రామలక్ష్మిని ఇంట్లో నుండి బయటకు గెంటేసినట్లు ఉహించుకుంటుంది. ఇప్పుడు నేను చెప్తే జరిగేది ఇదేనని రామలక్ష్మి ఆలోచిస్తుంది.

అప్పుడే సీతాకాంత్ ఆఫీస్ కి వెళ్తుంటే.. రామలక్ష్మి టెన్షన్ పడుతుంది. ఏమైంది అని పెద్దాయన అడుగుతాడు. ఏం లేదని రామలక్ష్మి అంటుంది. సీతాకాంత్, పెద్దాయన ఆఫీస్ బయలుదేర్తారు. ఆ తర్వాత సందీప్ అన్నయ్య ఇంట్లో నుండి బయలుదేర్తాడని అతనికి చెప్తాడు. ఆ విషయం రామలక్ష్మి వింటుంది. సందీప్ ని తిడుతుంటే వాళ్ళు ముగ్గురు నవ్వుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.