English | Telugu

Karthika Deepam2 : నేను సొంతకూతురిని కాదా.. కార్తిక్ కి కాశీ షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -153 లో.. శౌర్యని దీప తీసుకొని రావడం చూసి జ్యోత్స్న ఓర్వలేకపోతుంది. దీప కిచెన్ లో వంట చేస్తుంది. జ్యోత్స్న వచ్చి నువ్వెందుకు మా బావకి దగ్గర అవ్వాలని చూస్తున్నావ్.. నువ్వు పెద్ద జానవి అని జ్యోత్స్న అనగానే.. తనపైకి దీప చెయ్ ఎత్తుతుంది. నాపైకి చెయ్ లేపుతావా అంటూ జ్యోత్స్న అనగానే తప్పుగా మాట్లాడితే చెంప పగులగొడతాను. నువ్వు ఎందుకు నీ స్థానంలోకి వస్తానని భయపడుతున్నావని జ్యోత్స్నపై దీప కోప్పడుతుంది.

ఆ తర్వాత శౌర్యతో కార్తీక్ మాట్లాడుతాడు కానీ కాశీ, స్వప్నల గురించి ఆలోచిస్తాడు. అప్పుడే కాశీ ఇంటికి వస్తాడు. ఏంటి కాశీ అర్జంట్ గా మాట్లాడలన్నావని దీప అడుగుతుంది. ఇద్దరు కార్తీక్ దగ్గరికి వెళ్తారు. శౌర్యని బయటకు పంపిస్తారు. ఏంటి కాశీ సర్ ప్రైజ్ ఇచ్చావని కార్తీక్ అంటాడు. కాశీ జరిగింది చెప్తాడు. స్వప్న వాళ్ళ నాన్న ఫోన్ చేసి స్వప్నని వదిలేయమని బెదిరించాడు. నీ దగ్గరికి వచ్చాడా అని కార్తీక్ అడుగుతాడు. లేదని కాశీ అంటాడు. అంటే ముందే నాన్న దాస్ మావయ్యని చూసి ఉంటాడు. అందుకే వెళ్ళలేదేమోనని కార్తీక్ అనుకుంటాడు. సరే టెన్షన్ పడకండి అని కార్తీక్ కాశీకి ధైర్యం చెప్తాడు. మరొకవైపు జ్యోత్స్న ఇంట్లో అందరికి దీప తనపై చెయ్ ఎత్తిందని చెప్తుంది. నువ్వేదో అని ఉంటావ్ అందుకే నిన్ను అలా అందని అందరు అంటారు. దాంతో అసలు నేను మీ కూతురినా.. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్ అంటు రివర్స్ డ్రామా ప్లే చేస్తుంది జ్యోత్స్న..ఇదేంటి కొంపదీసి మీ కూతురిని కాదని చెప్తుందా అని పారిజాతం టెన్షన్ పడుతుంది. నేను సొంత కూతురు కాదని తెలిసేకంటే ముందే బావకి భార్యని అవ్వాలని.. మరి ఏంటి మీరు నాకు సపోర్ట్ చెయ్యడం లేదు.. వెంటనే బావకి నాకు పెళ్లి చెయ్యండి అనగానే అందరు సరే అంటారు.

మరొకవైపు స్వప్న బాధపడుతుంటే కాశీ ఎవరు చూడకుండా కిటికి దగ్గరికి వస్తాడు. కాశీని చూసి స్వప్న వస్తుంది. నువ్వేం టెన్షన్ పడకు. మా నానమ్మకి నేనంటే ఇష్టం. తనతో మాట్లాడిస్తానని కాశీ చెప్తాడు. కాశీ వెళ్ళిపోతాడు ఎవరు వచ్చారంటూ కావేరి వస్తుంది. కానీ కావేరికి కాశీ వచ్చాడని తెలియదు. ఆ తర్వాత కార్తీక్ దగ్గరికి దీప వచ్చి దీనికి ఒక్కటే సొల్యూషన్ బాబు మీ అమ్మగారికి నిజం చెప్పాలని దీప అంటుంది. మా నాన్నని అమ్మ దేవుడని అనుకుంటుంది. మా నాన్న ప్రేమని చూసి నేను జెలస్ గా ఫీల్ అయ్యేవాడినని దీపతో కార్తిక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.