English | Telugu

Brahmamudi : రుద్రాణి దొంగ.. స్వరాజ్ ని ప్రేమగా చూసుకుంటున్న అపర్ణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -824 లో....కావ్య నువ్వు వెళ్లి నీకు ఇచ్చిన నెక్లెస్ పెట్టుకొని రా అని అపర్ణ పంపిస్తుంది. కావ్య లాకర్ లో చూసేసరికి నెక్లెస్ ఉండదు. అదే విషయం అందరికి చెప్తుంది. ఎవరు తీశారు.. ఎక్కడ ఉంది.. అందరం మనమే కదా అని రాజ్ అంటాడు. మనం కాకుండా వీళ్ళు వచ్చారు కదా అని రేవతి పేరు చెప్తుంది. రుద్రాణి తన బ్యాగ్ లో వెతకాలని రేవతి బ్యాగ్ చెక్ చేస్తుంది కానీ అందులో ఏముండదు. నేను ఇందులోనే వేసాను కదా లేదేంటని రుద్రాణి షాక్ అవుతుంది.

నెక్లెస్ ఏమైంది అని అందరు అంటుంటే.. అప్పుడే స్వరాజ్, కనకం ఎంట్రీ ఇస్తారు. నాకు నెక్లెస్ ఎక్కడుందో తెలుసని అపర్ణని తీసుకొని స్వరాజ్, రుద్రాణి రూమ్ లో ఉన్న కబోర్డ్ చూపించి ఇందులో ఉందని చెప్తాడు. అపర్ణ నెక్లెస్ చూసి కోపంగా కిందకి వెళ్తుంది. నెక్లెస్ ఎక్కడ దొరికింది వదిన అని రుద్రాణి అడుగుతుంది. నీ గదిలోనే అని అపర్ణ అనగానే అందరు షాక్ అవుతారు. నేను తియ్యడం ఏంటని రుద్రాణి అంటుంది. అందరు తనపై కోప్పడతారు.

ఆ తర్వాత ఆ నెక్లెస్ ఎలా వచ్చిందని రుద్రాణి ఆలోచిస్తుంటే నేనే పెట్టాను.. నువ్వు మా అమ్మని ఇరికించాలని ట్రై చేసావ్ కానీ నువ్వే ఇలా అయ్యావని స్వరాజ్ అంటాడు. స్వరాజ్ తో పాటు కనకం కూడా ఉంటుంది. ఆ తర్వాత అందరు కలిసి భోజనం చేస్తారు. సుభాష్ , అపర్ణ ఇద్దరు స్వరాజ్ ని ప్రేమగా చూసుకుంటే రేవతి అది చూసి ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.