English | Telugu

Brahmamudi : మీడియాకి లీక్ అయిన భార్యాభర్తల గొడవ.. విడాకులు ఇస్తాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -851 లో...... కావ్య బాధపడుతుంటే వాళ్ళ నాన్న వస్తాడు. నాన్న నేను చేస్తుంది కరెక్టేనా అని అడుగుతుంది. కావ్యని మోటివేట్ చేస్తూ కృష్ణమూర్తి మాట్లాడతాడు. మరొకవైపు నాకు సపోర్ట్ చెయ్యొచ్చు కదా కళావతి అని రాజ్ ఫీల్ అవుతాడు. ఆ తర్వాత రాజ్ భోజనం చెయ్యడానికి వచ్చి అందరిని పిలుస్తాడు.

మాకు ఆకలిగా లేదు నిరాహార దీక్ష చేస్తున్నామని ఇందిరాదేవి అంటుంది. ఇందిరాదేవి ఫుల్ గా కావ్య వాళ్ళ ఇంట్లో తినేసి వచ్చి బేగ్ తీస్తుంది. నిరాహార దీక్ష చేసేటోళ్ళకి అలా వస్తాయా అని రాజ్ అంటాడు. ఏం తినకపోతే ఇలాగే వస్తాయని ఇందిరాదేవి అంటుంది. మీరు తినకండి నేను తింటానని రాజ్ వెళ్లి తింటుంటే.. అందరు వెళ్లి డిస్టబ్ చేస్తారు. ఆ తర్వాత మీడియా వాళ్ళు కావ్య దగ్గరికి వచ్చి మీ భర్తతో మీరు గొడవపడి వచ్చారట.మ అందుకు కారణం మీ బిడ్డ అంట కదా అని అడుగుతారు. అలాంటివి ఏం లేవని కావ్య చెప్పి లోపలికి వెళ్తుంది.

అయిన మీడియా వాళ్ళు రాజ్ గురించి తప్పుగా మాట్లాడతారు. అదంతా రాజ్ వాళ్ళు చూస్తారు. కావ్య ఈ ఇంటి పరువు తీస్తుందని కావ్యపై కోపం వచ్చేలా రుద్రాణి మాట్లాడుతుంది. ఆ తర్వాత రుద్రాణి, రాహుల్ కలిసి కావ్య, రాజ్ మధ్య దూరం పెంచాలని ట్రై చేస్తారు.తరువాయి భాగంలో రాజ్ దగ్గరికి రుద్రాణి విడాకుల పత్రాలు తీసుకొని వెళ్లి విడాకులు ఇస్తానని కావ్యని బెదిరించు.. అప్పుడు నీతో ఇంటికి వస్తుందని రుద్రాణి చెప్తుంది. రాజ్ అవి
పట్టుకొని కావ్య దగ్గరికి వెళ్లి ఇంటికి వస్తావా లేదా విడాకుల పత్రాలపై సంతకం పెటడతావా అని అంటాడు. దాంతో కావ్య షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.