English | Telugu

Brahmamudi : అప్పు టెన్షన్.‌. అక్క లెటర్ రాసి వెళ్ళిపోయిందిగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -847 లో.....రాజ్ కి డాక్టర్ ఫోన్ చేసి ఇంకా కొన్ని రోజుల్లో కావ్యకి అయిదు నెలలు పడుతాయి. అప్పుడు అబార్షన్ చెయ్యడం వీలు కాదు. అప్పుడు తల్లి బిడ్డని కోల్పోవాల్సి ఉంటుందని డాక్టర్ బెదిరిస్తుంది. నువ్వు త్వరగా కావ్యకి అసలు విషయం చెప్పి ఒప్పించని డాక్టర్ చెప్తుంది. దాంతో రాజ్ లో టెన్షన్ మొదలవుతుంది. ఇప్పటికైనా వదినకి నిజం చెప్పు అన్నయ్య అని కళ్యాణ్ అంటాడు.

నిజం చెప్పి ఇంట్లో వాళ్ళని బాధపెట్టలేనని రాజ్ అంటాడు. మరొకవైపు కావ్య గురించి అప్పు తల్చుకొని ఒక్కసారిగా ఉల్లిక్కిపడి నిద్రలేస్తుంది. అక్కతో మాట్లాడాలని అప్పు వెళ్తుంటే ధాన్యలక్ష్మి జ్యూస్ తీసుకొని వస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్లనవసరం లేదని టాబ్లెట్ ఇస్తుంది. దాంతో అప్పు పడుకుంటుంది. ధాన్యలక్ష్మి వస్తుంటే రుద్రాణి ఎదురుపడుతుంది. అప్పు ఈ సిచువేయేషన్ లో కూడా అక్క గురించి ఆలోచిస్తుందని ధాన్యలక్ష్మికి కావ్యపై ఇంకా కోపం కలిగేలా రుద్రాణి చేస్తుంది. దాంతో ధాన్యలక్ష్మి కోపంగా ఇంట్లో అందరిని పిలుస్తుంది. కావ్య, రాజ్ లు సమస్య ని పరిష్కారించుకొని గొడవలు లేకుండా చూసుకోవాలని ధాన్యలక్ష్మి అందరికి చెప్తుంది.

నేను నా నిర్ణయం మార్చుకోనని రాజ్ అనగానే అయితే నా కొడుకు కోడలిని తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతానని ధాన్యాలక్ష్మి అనగానే మీ నిర్ణయానికి అడ్డు చెప్పనని రాజ్ అనగానే సీతారామయ్య వచ్చి రాజ్ చెంప చెల్లుమనిపిస్తాడు. ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చెయ్యాలనుకుంటున్నావా అని సీతారామయ్య అంటాడు. నేను ఎప్పుడు కుటుంబం గురించి ఆలోచిస్తాను. ఈ విషయంలో నాలో ఎలాంటి మార్పు లేదని రాజ్ చెప్పి వెళ్ళిపోతాడు. తరువాయి భాగంలో కావ్య లెటర్ రాసి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. అది అపర్ణ చూసి ఇంట్లో అందరికి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.