English | Telugu

Brahmamudi : రుద్రాణి చెంపచెల్లుమనిపించిన ఇందిరాదేవి.. వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయ్యేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -785 లో.....రాజ్, కావ్య, ఇందిరాదేవి, రేవతి వాళ్ళు మాట్లాడుకుంటారు. అన్ని విషయాలు మీ అమ్మతో చెప్పే నువ్వు.. నీ ప్రేమ విషయం దాచి డైరెక్ట్ పెళ్లి చేసుకొని వచ్చావని రేవతితో అంటుంది ఇందిరాదేవి. ఆ రోజు రుద్రాణి అత్తయ్య సలహా వల్ల అలా చెయ్యాలిసి వచ్చిందని రేవతి అంటుంది. మేమ్ ఒకసారి మాట్లాడుకుంటుండగా రుద్రాణి అత్త చూసి మీరు ఇద్దరు పెళ్లి చేసుకొని రండి అప్పుడు మీ వాళ్ళు తప్పక ఆక్సెప్ట్ చేస్తారని చెప్పిందని రేవతి చెప్తుంది.

అందుకే ఇలా చేసానని రేవతి చెప్పగానే ఆ రుద్రాణి వల్లే ,నీకు ఈ పరిస్థితి వచ్చిందని కావ్య ఇందిరాదేవి ఇద్దరు తనపై కోపంగా ఉంటారు. మరొకవైపు రుద్రాణి పాటలు పెట్టుకొని డాన్స్ చేస్తుంది. మమ్మీ ఏం చేస్తున్నావ్ ఇలా హ్యాపీగా ఫీల్ అవుతే ఇందులో మన హస్తం ఉందనుకుంటారని రాహుల్ అంటాడు. ఆ రోజు నేనే రేవతిని పెళ్లి చేసుకోమని చెప్పి ఈ ఇంటికి దూరం చేసాను.. ఇక రాజ్ ని యామినికి దగ్గర చేసి ఈ ఇంటికి దూరం చేస్తే ఆస్తులు మనవి అవుతాయని రుద్రాణి అంటుంది. అప్పుడే ఇందిరాదేవి వచ్చి రుద్రాణి చెంపచెల్లుమనిపిస్తుంది. ఎందుకు కొట్టావని రుద్రాణి అడుగుతుంది. పదిహేను సంవత్సరాల క్రితం చేసిన తప్పుకి అని ఇందిరాదేవి అంటుంది.

ఆ తర్వాత రేవతి ఇంటికి పిలిస్తే కలుస్తారని రాజ్ ప్లాన్ చెప్పినందుకు రాజ్ పై కావ్య కోపంగా ఉంటుంది. మళ్ళీ రాజ్, కావ్య ఒక ప్లాన్ చేస్తారు. వాళ్ళని గుళ్లో ఎదురుపడేలా చెయ్యాలని చెప్తాడు. దానికి కావ్య సరే అంటుంది. కావ్య, ఇందిరాదేవి ప్లాన్ చేసి అపర్ణ గుడికి వెళ్లేలా చేస్తారు. రాజ్ రేవతి ఇంక బాబు వెళ్లేలా చేస్తాడు. తరువాయి భాగంలో రేవతి బాబు స్వరాజ్ ని అపర్ణ గుడి నుండి ఇంటికి తీసుకొని వస్తుంది. ఈ బాబు గుళ్లో తప్పిపోయి కన్పించాడని అపర్ణ అనగానే.. ఈ బాబుని ఎక్కడో చూసానని స్వప్న, అప్పు అంటుంటే ఎక్కడ చెప్పేస్తారో అని రాజ్, కావ్య టెన్షన్ పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.