English | Telugu

Brahmamudi : రాజ్ మనుసుని యామిని మార్చనుందా.. అతన్ని వెతుక్కుంటూ కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -667 లో.....రాజ్ లేడని అందరు చెప్తున్న కావ్య వినిపించుకోదు. ఉన్నాడు.. నాకు నమ్మకం ఉంది.. నేను వెళ్లి వెతుకుతానంటూ కావ్య గట్టిగా అరుస్తుంది. డాక్టర్ వచ్చి ఏంటి అందరికి డిస్టబెన్స్.. ఇప్పుడు పేషెంట్ బాగానే ఉంది డిశ్చార్జ్ చేస్తున్నామని డాక్టర్ అంటాడు. చెయ్యండి డాక్టర్... వెళ్లి నా భర్తని వెతుక్కుంటానని కావ్య అంటుంది.

ఒకవైపు కావ్య డిశ్చార్జ్ అయి వెళ్తుంటే.. మరొక వైపు రాజ్ ని యామిని వాళ్ళు డిశ్చార్జ్ చేసి తీసుకొని వెళ్తారు. యామిని రాజ్ ని ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఇంటికి వెళ్లేసరికి గోడ నిండా రాజ్ తన ఫొటోస్ ఉంటాయి. చూడు బావ మనకి ఎంగేజ్మెంట్ కూడా అయిందని యామిని చెప్తుంటుంది. చిన్నప్పటి నుండి నువ్వే ప్రాణం అనుకుంటుంది బాబు అని యామిని వాళ్ళ అమ్మ అంటుంది. రాజ్ ని యామిని గదిలోకి తీసుకొని వెళ్తుంది. అక్కడ కావాలనే వాళ్ళు కాలేజీలో దిగిన ఫొటోస్ అన్ని కలపి ఒక ఆల్బమ్ లాగా పెడుతుంది. అదంతా రాజ్ చూస్తాడు. మళ్ళీ యామిని వచ్చి.. ఇప్పుడు అవన్నీ ఎందుకు రెస్ట్ తీసుకోమని రాజ్ ని పడుకోబెడుతుంది. మరొకవైపు కావ్య డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తుంది. రాజ్ ఫోటోని తీసుకొని మీరు ఎక్కడో ఒకచోట ఉన్నారు.. ఇప్పుడు మీకు ఆకలి అవుతుందేమోనని కావ్య ఫోటో చూస్తూ మాట్లాడుతుంటే అందరు తనని చూసి బాధపడుతారు. మీరేం అధైర్యపడకండి అత్తయ్య.. మీ అబ్బాయిని నేను తీసుకొని వస్తానని అపర్ణకి కావ్య చెప్తుంది. ఫోటో తీసుకొని కావ్య లోపలికి వెళ్తుంది

ఇలానే వదిలేస్తే పిచ్చిది అయ్యేలా ఉంది.. రాజ్ లేడని చెప్పండి అని రుద్రాణి అనగానే ఇందిరాదేవి తన చెంపచెల్లుమనిస్తుంది. నేను అన్నదాంట్లో తప్పేముంది మనకి తెలుసు ఆ విషయం.. తనకి అర్థమయ్యేలా చెప్పాలి కదా.. చేయవలసిన కార్యక్రమలు చెయ్యాలి కదా అని రుద్రాణి అంటుంటే.. రాజ్ ఉన్నాడని తను నమ్ముతుందంటు రుద్రాణికి బుద్ది చెప్తుంది ఇందిరాదేవి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.