English | Telugu

Brahmamudi : కావ్యని పెళ్ళికి పిలిచిన యామిని.. తన ప్లాన్ ఏంటంటే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -743 లో.....రాజ్ ఇంటికి రాగానే.. ఏంటి ఈ హడావిడి అని అడుగుతాడు. ఏంటి ఆలా అడుగుతున్నావ్.. ఎల్లుండి మీ పెళ్లి కదా అని వైదేహి అంటుంది. అది విని రాజ్ షాక్ అవుతాడు. నాకు ఇప్పుడే పెళ్లి ఇష్టం లేదని రాజ్ అనగానే.. అప్పుడే యామిని వస్తుంది. ఏంటి మమ్మీ బావకి ఇష్టం లేదట.. అలాంటప్పుడు ఎందుకు ఈ డెకరేషన్ అంటూ పూల డెకరేషన్ అన్ని తీసేస్తుంది.

బావకి నేనంటే ఇష్టం లేనప్పుడు.. నేను ఎందుకు ఇక.. అంటూ కత్తితో చెయ్ ని కోసుకుంటుంది. వెంటనే రాజ్ ఆపి యామిని చెంప చెల్లుమనిపిస్తాడు. ఇక యామిని పేరెంట్స్ రాజ్ ని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చెయ్యడంతో రాజ్ పెళ్లికి ఒప్పుకుంటాడు. దాంతో యామిని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత అపర్ణ, ఇందిరాదేవి రాజ్ కి ఫోన్ చేస్తుంటారు కానీ రాజ్ లిఫ్ట్ చెయ్యడు. దాంతో ఇందిరాదేవి డిస్సపాయింట్ అవుతుంది. చూసుకొని చేస్తాడులే అని సుభాష్ అంటాడు.

ఇక వాడేందుకు చేస్తాడు యామినితో బిజీగా ఉండొచ్చు అని రుద్రాణి అనగానే.. ఇంట్లో అందరు తనకి చివాట్లు పెడతారు. ఆ తర్వాత మనం చేస్తే లిఫ్ట్ చెయ్యడం లేదు.. కావ్య చేస్తే లిఫ్ట్ చేస్తాడేమో ఒకసారి చెయమందామని ఇందిదేవి, అపర్ణ కలిసి కావ్య దగ్గరికి వెళ్తారు. వాళ్ళు వెళ్లేసరికి ఐస్ క్రీమ్ తింటుంది కావ్య. ఏంటి ఇది ఇలా తయారు అయిందని అనుకుంటారు. తరువాయి భాగంలో దుగ్గిరాల ఇంటికి యామిని వస్తుంది. రాజ్తో నా పెళ్లి మీరు తప్పకుండా రండి అని కావ్య దగ్గరికి వచ్చి పిలుస్తుంది యామిని. తప్పకుండా వస్తామని కావ్య చెప్తుంది. కావ్య అలా చెప్పిందంటే ఏదో ప్లాన్ లో ఉండే ఉంటుందని ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.